For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Shoaib Akhtar: ఇంతకన్నా సిగ్గుచేటు లేదు.. పాక్‌పై నిప్పులు చెరిగిన అక్తర్!

ఆఫ్ఘనిస్తాన్‌ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్ జట్టుపై ఆ జట్టు మాజీలు నిప్పులు చెరుగుతున్నారు. ఇంతకుమించిన సిగ్గు చేటు పాక్ జట్టుకు కానీ, దేశ క్రికెట్ బోర్డుకు కానీ ఉండదని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కూడా పాక్ జట్టుపై, పీసీబీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఆఫ్ఘన్‌పై పాక్ ఓడిన తీరుపై షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ చానెల్లో స్పందించాడు. ఆఫ్ఘన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఓడిన తీరు చూసిన తర్వాత ఏం చెప్పాలో అర్థం కావడం లేదన్న అక్తర్.. ఈ ఓటమికి పాక్ క్రికెట్ బోర్డును దోషిగా తేల్చాడు. ఎవరు పడితే వాళ్లు బోర్డు ప్రెసిడెంట్ అయిపోతున్నారని, సరైన వ్యక్తిని సరైన పోస్ట్‌లో కూర్చోబెట్టాలన్నాడు. లేకపోతే పాక్ క్రికెట్ ఇంతకంటే దిగజారిపోతుందన్నాడు.

World Cup 2023 Shoaib Akhtar slams PCB and Pak team

'గత 20, 30 ఏళ్లుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాలకు, చేసిన పనులకు ఈ మ్యాచ్ అసలైన ఉదాహరణ. మీరు చేసిన పనికి లభించిన ఎండ్ రిజల్ట్ ఇదే' అంటూ పీసీబీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇక పాక్ క్రికెట్ జట్టు గురించి మాట్లాడుతూ.. ప్రస్తుత పాక్ జట్టులో ఒక్క క్రికెటర్ కూడా తర్వాతి జనరేషన్‌‌కు ఇన్స్‌పిరేషన్ అయ్యే ఆటగాడు లేడని షోయబ్ అన్నాడు. 'నేను వకార్ యూనిస్, వసీం అక్రమ్, ఇమ్రాన్ ఖాన్, స్టీవ్ వా, అలెన్ బోర్డర్, వివ్ రిచర్డ్స్ వంటి గొప్ప గొప్ప ఆటగాళ్లను చూశాను. మరి ఇప్పుడున్న పాక్ జట్టులో అలాంటి ఇన్స్‌పైరింగ్ ఆటగాడు ఒక్కడైనా ఉన్నాడా..?' అంటూ అక్తర్ నిలదీశాడు.

అలాగే ఒకవేళ తాను ఇప్పుడు బాబర్‌తో ఉండి ఉంటే.. పాక్ చరిత్రలో ఇంతకుమించిన చెత్త ప్రదర్శన మరొకటి ఉండదని, ఇలాగే ఆడితే మిగిలిన నాలుగు జట్లపై కూడా ఓటమి ఖాయమని, ఇప్పటికైనా కెప్టెన్‌గా ఎదగాలని సూచించేవాడినని అక్తర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, October 24, 2023, 16:52 [IST]
Other articles published on Oct 24, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+