For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World Cup 2023: బాబర్ కన్నా అతనే బెటర్.. ఆజామ్‌కు ఇంతకన్నా అవమానం ఉండదేమో?

వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ చెత్త ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అలాగే బాబార్ ఆజమ్‌‌ కెప్టెన్సీపై కూడా విశ్లేషకులు, మాజీ ఆటగాళ్లు పెదవి విరుస్తున్నారు. ఇక తాజాగా న్యూజిల్యాండ్ లెజెండ్ షేన్ బాండ్ కూడా బాబర్ కెప్టెన్సీని తప్పుబట్టాడు. అతడికంటే నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ బెటర్ కెప్టెన్ అంటూ సంచలన కామెంట్స్ చేశాడు.

తాజాగా షేన్ బాండ్ ఓ ఇంటర్వ్యూలో వరల్డ్ కప్‌ టోర్నీ గురించి మాట్లాడాడు. 'పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్‌లలో ఫేవరెట్ కెప్టెన్ ఎవరు..?' అనే ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా బాండ్.. స్కాట్ ఎడ్వర్డ్స్‌ను ఎంచుకుని అందరికీ షాకిచ్చాడు. తన దృష్టిలో బాబర్ కంటే ప్రస్తుత వరల్డ్ కప్‌లో స్కాట్ ఎడ్వర్డ్స్ బెటర్ కెప్టెన్‌గా కనిపిస్తున్నాడన్నాడు.

 World Cup 2023: Shane bond picks Scott Edwards over Babar Azam as a better captain

ప్రస్తుతం కొనసాగుతున్న వరల్డ్ కప్‌లో బాబర్ అటు కెప్టెన్‌గానూ. ఇటు బ్యాటర్‌గానూ చెత్త ఫాంలో కొనసాగుతున్నాడు. ఆడిన 5 మ్యాచ్‌లలో కేవలం 2 హాఫ్ సెంచరీలు మాత్రమే చేసిన బాబర్.. ఆసీస్, శ్రీలంక, నెదర్లాండ్స్‌లపై ఫెయిలయ్యాడు. ఇక బాబర్ కెప్టెన్సీపై కూడా ఆ జట్టు మాజీ క్రికెటర్లు విరుచుకుపడుతున్నారు. ఇంత చెత్త కెప్టెన్సీ ఎక్కడా చూడలేదని, బాబర్‌ను వెంటనే కెప్టెన్‌గా తొలగించాలని వాదిస్తున్నారు.

అదే సమయంలో పసికూన దేశం నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ అటు బ్యాటర్‌గా, ఇటు కెప్టెన్‌గా గొప్పగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా సౌతాఫ్రికాపై గెలవడంలో ఎడ్వర్డ్స్‌దే కీలక పాత్ర. ఆ మ్యాచ్‌లో ఎడ్వర్డ్స్ (78 నాటౌట్) అజేయమైన హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఆ తర్వాత సూపర్ కెప్టెన్సీతో సౌతాఫ్రికాను తక్కువ స్కోరుకే కట్టడి చేశాడు. అతడి కెప్టెన్సీలో నెదర్లాండ్స్ ఆత్మవిశ్వాసంతో ముందుకెళుతోంది. పసికూనగా టోర్నీలో అడుగుపెట్టిన నెదర్లాండ్స్ పటిష్ఠ సౌతాఫ్రికాను ఓడించడమే కాకుండా.. శ్రీలంక, న్యూజిల్యాండ్‌లపై కూడా మెరుగైన ప్రదర్శన చేసింది. మైదానంలో స్కాట్ కెప్టెన్సీ అద్భుతంగా ఉందని ఇప్పటికే మాజీలు మెచ్చుకుంటున్నారు కూడా.

ఇదిలా ఉంటే ఇదే ఇంటర్వ్యూలో షేన్ బాండ్ మిగిలిన కెప్టెన్ల గురించి కూడా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. బాబర్‌ను కాదని ఎడ్వర్డ్స్‌ను ఎంచుకున్న బాండ్.. ఎడ్వర్డ్స్‌తో పాటు ఆఫ్ఘన్ కెప్టెన్ హష్మతుల్లా, శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్, బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్‌ల కంటే ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ బెటర్ కెప్టెన్ అన్నాడు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను మొత్తం టోర్నీలోనే బెస్ట్ కెప్టెన్‌గా బాండ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, October 26, 2023, 16:41 [IST]
Other articles published on Oct 26, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+