భారత్‌తో మ్యాచ్ అంటే చాలు పాకిస్తాన్ ఆటగాళ్లు కొద్దిగా ఓవర్ యాక్షన్ చేస్తూనే ఉంటారు. శనివారం వరల్డ్ కప్ మ్యాచ్ నేపథ్యంలో కూడా ఆ జట్టు ఆటగాళ్లు అలాంటి కామెంట్సే చేస్తున్నారు. తాజాగా పేసర్ షాహీన్ షా అఫ్రిదీ ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ రానే వచ్చింది. వరల్డ్ కప్‌లో భాగంగా ఈ రెండు జట్లు శనివారం తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకున్నాయి. నెట్స్‌లో చెమటోడ్చి ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ జట్టు పేసర్ షాహీన్ షా అఫ్రిదీ టీమిండియా బ్యాటర్ల గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ప్రాక్టీస్ ముగించుకుని గ్రౌండ్ బయటకు వెళుతున్న షాహీన్‌ను రిపోర్టర్లు, ఫ్యాన్స్ చుట్టుముట్టారు. రిపోర్టర్లు మ్యాచ్ గురించి, ప్రాక్టీస్ గురించి ప్రశ్నలడుగుతుంటే.. ఫ్యాన్స్ సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దీంతో షాహీన్.. 'సెల్ఫీ కచ్చితంగా ఇస్తాను. కానీ భారత్‌పై 5 వికెట్లు తీసిన తర్వాత..' అన్నాడు. ఈ కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇక షాహీన్ కామెంట్స్‌పై భారత ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 'బౌలింగ్ చేయడంపై కాన్‌సన్‌ట్రేషన్ చెయ్.. నోటికొచ్చిన కామెంట్స్ చేయడంపై కాదు.. ' అని ఓ యూజర్ కామెంట్ చేస్తే.. ఇంకో యూజర్.. 'మీ పాకిస్తాన్ ఆటగాళ్లకి ఈ బిల్డప్ తప్ప గ్రౌండ్‌లో భారత్‌ను ఎదుర్కోవడం రాదు..' అని ట్రోల్ చేశాడు.
ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో షాహీన్ రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు. ఆసియా కప్ 2023లో భారత్‌తో జరిగిన ఏకైక మ్యాచ్‌లో షాహీన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ బౌండరీల మోత మోగించారు. అలాగే ఈ వరల్డ్ కప్‌లో హారిస్ రవూఫ్, హసన్ అలీ అద్భుత బౌలింగ్‌తో రాణిస్తుంటే వాళ్లముందు షాహీన్ తేలిపోతున్నాడు.
నెదర్లాండ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 7 ఓవర్లు వేసిన షాహీన్ 37 రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 9 ఓవర్లేసిన షాహీన్.. 66 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ బౌలింగ్‌తో మరి భారత్‌పై 5 వికెట్లు ఎలా తీస్తాడో చూడాలి మరి.