Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: హైదరాబాద్‌ గురించి స్పెషల్ పోస్టు పెట్టిన పాక్ స్టార్ షహీన్ అఫ్రిదీ!

వరల్డ్ కప్ కోసం దాదాపు అన్ని జట్లు భారత్‌కు వచ్చేశాయి. ఈ మెగా టోర్నీలో తమ సత్తా నిరూపించుకునేందుకు దాయాది దేశం పాకిస్తాన్ కూడా హైదరాబాద్ చేరుకుంది. ఇక్కడే ఎక్కువ మ్యాచులు ఆడే పాక్.. మొదటగా న్యూజిల్యాండ్‌తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో హైదరాబాద్ చేరుకున్న ఈ జట్టుకు ఇక్కడ ఘనమైన ఆరంభం లభించింది.

ఇప్పటికే ఇక్కడకు వచ్చేసిన పాక్ అభిమానులు.. క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఈ టీంకు మంచి స్వాగతం అందజేశారు. పాకిస్తాన్ టీంలో చాలా మంది ప్లేయర్లు ఇప్పటి వరకు భారత్‌లో ఆడలేదు. దీంతో తొలిసారి వారిని చూసిన క్రికెట్ ఫ్యాన్స్ కూడా చాలా ఎగ్జయిట్ అయ్యారు. అలాగే ప్లేయర్లు కూడా చాలా ఉత్సాహంగా కనిపించారు.

World Cup 2023 Shaheen Shah Afridi post about Hyderabad goes viral

అదే సమయంలో ఆటగాళ్ల భద్రతకు ఎలాంటి సమస్య రాకుండా ఎయిర్‌పోర్టులో కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అభిమానులు.. పాక్ టీంకు ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఇదే విషయాన్ని పాకిస్తాన్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిదీ తన సోషల్ మీడియాలో వెల్లడించాడు.

ఇలా భారత క్రికెట్ ఫ్యాన్స్ నుంచి సాదర స్వాగతం లభించడంతో పాక్ టీం చాలా ఎగ్జయిట్ అయినట్లు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రాం స్టోరీ షేర్ చేసిన షహీన్.. తను హైదరాబాద్‌లో ఉన్నట్లు ఈ నగరాన్ని ట్యాగ్ చేశాడు. 'ఇప్పటి వరకు అద్భుతమైన స్వాగతం లభించింది' అని దీనికి క్యాప్షన్ జతచేశాడు.

ఇది చూసిన చాలా మంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌లో అతిథి మర్యాదలు ఇలాగే ఘనంగా జరుగుతాయని చాలామంది చెప్తున్నారు. ఇక హైదరాబాద్‌లో న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచులు ఆడే పాకిస్తాన్.. ఆ తర్వాత అక్టోబర్ 6న తమ తొలి వరల్డ్ కప్ మ్యాచులో నెదర్లాండ్స్‌తో తలపడుతుంది.

ఈ ఇష్యూ పెద్దది అవకుండా ఉండటం కోసం తన ట్రావెలింగ్ ధ్రువ పత్రాలను కూడా అధికారులకు చూపించాడు. టికటె్లు, ఐడెంటిటీ కార్డులను కూడా వారికి చూపించాడు. దీంతో అధికారులు అతన్ని కస్టడీ నుంచి విడుదల చేశారు. అప్పుడు మళ్లీ ఫ్యాన్స్‌తో కలిసి తమ టీంకు ఆహ్వానం పలికాడు బషీర్.

హైదరాబాద్‌లోనే పాక్ జట్టు తమ తొలి వార్మప్ మ్యాచ్ ఆడనుంది. న్యూజిల్యాండ్‌తో జరిగే ఈ మ్యాచుకు ముందుగా ప్రేక్షకులను అనుమతించాలని అనుకున్నారు. కానీ వినాయక నిమజ్జనాలు సహా ఆ రోజున పండుగలు ఉండటంతో మ్యాచ్‌కు భద్రత కల్పించడం కష్టమని స్థానిక అధికారులు చెప్పారు. దీంతో ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించడం లేదని, టికెట్ డబ్బులు వాపస్ చేస్తామని బీసీసీఐ తెలిపిన సంగతి తెలిసిందే.

Story first published: Friday, September 29, 2023, 8:30 [IST]
Other articles published on Sep 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+