Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: వరల్డ్ కప్‌ టీంలో నో ఛాన్స్.. కీ ప్లేయర్లకు సెలక్టర్ల మొండి చెయ్యి?

వన్డే వరల్డ్ కప్ ఆడే టీంను బీసీసీఐ ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో పాల్గొనాలని ఎంతో మంది ప్లేయర్లు ఆశించారు. కానీ కేవలం 15 మందికే జట్టులో చోటు దక్కింది. వీరిలో కొందరు చివరి మెట్టు వరకు వచ్చినా.. తుది జట్టులో చోటు సంపాదించలేకపోయారు. అలా వరల్డ్ కప్ టీంలో ఛాన్స్ మిస్ అయిన ముగ్గురు కీ ప్లేయర్లు ఎవరంటే?

ప్రసిద్ధ్ కృష్ణ:గాయం నుంచి ఇటీవలే కోలుకున్న ఈ యంగ్ పేసర్.. ఐర్లాండ్‌పై రాణించాడు. ప్రసిద్ధ్ ఇప్పటి వరకు భారత్ తరఫున 14 వన్డేలు ఆడాడు. వీటిలో 25 వికెట్లు తీసుకొని ఆకట్టుకున్నాడు. కానీ గాయం కారణంగా దాదాపు ఏడాదిపాటు జట్టుకు దూరమయ్యాడు.

World Cup 2023 Selectors did unjustice to these three players

కానీ రీఎంట్రీలో కూడా రాణించడంతో వన్డే వరల్డ్ కప్‌లో ప్రసిద్ధ్ కృష్ణకు కచ్చితంగా చోటు దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ షమీ, సిరాజ్‌తోపాటు బుమ్రా కూడా జట్టుతో చేరడంతో ప్రసిద్ధ్‌కు టీంలో చోటు లేకుండా పోయింది.

సంజూ శాంసన్:అవకాశాలు ఇచ్చినా నిలకడ లేని ప్లేయర్ అని సంజూపై ముద్రపడింది. అయితే వన్డే ఫార్మాట్‌లో అతను ఈ ముద్రను చెరిపేసుకున్నాడు. 60పైగా సగటుతో బ్యాటింగ్ చేస్తూ వన్డే టీంలో కీలకంగా మారాడు. కానీ వరల్డ్ కప్‌లో మాత్రం వికెట్ కీపర్ బ్యాటర్ పొజిషన్‌ను సొంతం చేసుకోలేకపోయాడు.

గాయం నుంచి ఇటీవలే కోలుకున్న కేఎల్ రాహుల్ వైపు సెలెక్టర్లు మొగ్గు చూపారు. అతనికి బ్యాకప్‌గా మంచి ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌ను తీసుకున్నారు. దీంతో సంజూ మరోసారి టీంలో చోటు కోల్పోయాడు.

World Cup 2023 Selectors did unjustice to these three players

యుజ్వేంద్ర చాహల్:వన్డే టీంకు చాలాకాలంగా దూరంగా ఉన్న ఆటగాళ్లలో చాహల్ ఒకడు. ఈ లెగ్ స్పిన్నర్‌కు విండీస్ టూర్‌లో కూడా వన్డేలు ఆడే ఛాన్స్ దక్కలేదు. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ టీంలో స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. అతనికి సహకారంగా జడేజా, అక్షర్ పటేల్‌ రూపంలో ఆల్‌రౌండర్లను ఎంచుకున్నారు.

ఆసియా కప్‌లో కూడా చాహల్‌ను అవకాశం దక్కలేదు. దీంతో అతనికి వరల్డ్ కప్‌లో అవకాశం దక్కడం కష్టమే అనుకున్నా.. మెగాటోర్నీలో స్పిన్ కీలకం కాబట్టి చాహల్‌ను ఎంపిక చేస్తారని అనుకున్నారు. కానీ అది జరగలేదు.

Story first published: Wednesday, September 6, 2023, 13:40 [IST]
Other articles published on Sep 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+