Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: ఏడాది తిరగకుండానే.. సఫారీలకు రెండుసార్లు షాకిచ్చిన నెదర్లాండ్స్..!

వరల్డ్ కప్‌ టోర్నీల్లో ఫేవరెట్ జట్లను ఓడించడం అంత ఈజీ కాదు. కానీ కొన్నిసార్లు ఎవరూ ఊహించని అప్‌సెట్స్ అందర్నీ ఆశ్చర్యంలో ముంచేస్తాయి. తాజాగా వన్డే వరల్డ్ కప్‌లో అలాంటిదే జరిగింది. పసికూన నెదర్లాండ్స్ అద్భుతమైన పోరాట పటిమ చూపించి, బలమైన సౌతాఫ్రికాను చిత్తుచేసింది. అయితే సఫారీలకు నెదర్లాండ్స్ షాకివ్వడం ఇదే తొలిసారి కాదు.

గతేడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మెగాటోర్నీలో కూడా సఫారీల కొంపముంచింది నెదర్లాండ్స్ జట్టే. అడిలైడ్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఆ టోర్నీలో కూడా ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగిన సౌతాఫ్రికా.. చాలా ఈజీగా ఈ మ్యాచ్ గెలిచేస్తుందని అంతా అనుకున్నారు.

World Cup 2023 SAvsNED Netherlands gave shock to South Africa two times within a year

కానీ ఒక్కరంటే ఒక్క బ్యాటర్ కూడా నిలకడగా ఆడకపోవడంతో సఫారీలు తడబడ్డారు. అదే సమయంలో నెదర్లాండ్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 145 పరుగులే చేయగలిగింది. ఈ ఓటమితో సౌతాఫ్రికా.. టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ రేసు నుంచి తప్పుకుంది కూడా. ఆ ఓటమిని సఫారీ ఫ్యాన్స్ అస్సలు ఊహించలేదు. మళ్లీ ఏడాది తిరక్కుండానే సరిగ్గా అలాంటి ఫలితమే రావడం గమనార్హం.

ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచులో కూడా తొలుత నెదర్లాండ్స్ బ్యాటింగ్ చేసి మంచి స్కోరు చేసింది. ఛేజింగ్‌లో సౌతాఫ్రికా తంటాలు పడింది. చివరకు మార్క్రమ్, మిల్లర్ మీద ఆధారపడింది. గతేడాది కూడా వీళ్లిద్దరి మీదనే ఆధారపడగా.. ఇద్దరూ విఫలమయ్యారు. ఇప్పుడు కూడా దాదాపు అలాగే జరిగింది. వీళ్లిద్దర్నీ నెదర్లాండ్స్ బౌలర్లు బుట్టలో వేసుకున్నారు. మిల్లర్ కాసేపు పోరాడినా అతనికి సహకారం దక్కలేదు.

గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో సాధించిన విజయం.. సఫారీలపై నెదర్లాండ్స్‌కు మొట్టమొదటి విజయం. అంతకుముందు సౌతాఫ్రికాను నెదర్లాండ్స్ ఒక్కసారి కూడా ఓడించలేదు. ఇప్పుడు వన్డేల్లో సఫారీలపై నెదర్లాండ్స్‌కు ఇది తొలి విజయం. అంతేకాదు, టెస్టు ప్లేయింగ్ దేశంపై నెదర్లాండ్స్ సాధించిన మొదటి విజయం కూడా. ఇదంతా చూసిన ఫ్యాన్స్.. సౌతాఫ్రికా అంటే నెదర్లాండ్స్‌కు ఇంత ప్రేమ ఎందుకో? అంటూ వెటకారం ఆడుతున్నారు.

Story first published: Wednesday, October 18, 2023, 11:35 [IST]
Other articles published on Oct 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+