Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SAvsBAN: సఫారీలకు షాకివ్వాలని షకీబ్ ఆరాటం.. మరో అప్‌సెట్ చూస్తామా?

SAvsBAN: వరల్డ్ కప్‌లో పలు సంచలనాలు చూసిన ఫ్యాన్స్‌కు మరో సంచలనం చూపించాలని బంగ్లాదేశ్ అనుకుంటోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న సౌతాఫ్రికాను ఓడించాలని తహతహలాడుతోంది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన సఫారీ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.

ఇది సఫారీ స్టార్ క్వింటన్ డీ కాక్ ఆడుతున్న 150వ వన్డే కావడం గమనార్హం. ఈ సందర్భంగా టాస్ ముందు సఫారీ టీం అంతా కలిసి హడిల్‌గా ఏర్పడి డీ కాక్‌ను అభినందించింది. ఈ మ్యాచులో కూడా సౌతాఫ్రికా రెగ్యులర్ కెప్టెన్ టెంబా బవుమా ఆడటం లేదు.

World Cup 2023 SAvsBAN Shakib wants to stun in-form South Africa

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు బవుమాకు గ్యాస్ట్రిక్ సమస్య వచ్చింది. అది ఇంకా పూర్తిగా తగ్గక పోవడంతో అతన్ని పక్కన పెట్టామని సౌతాఫ్రికా టీం మేనేజ్‌మెంట్ తెలిపింది. అతని స్థానంలో ఎయిడెన్ మార్క్రమ్ ఈ జట్టుకు సారధ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

బవుమాతోపాటుగా మరో కీలక ప్లేయర్ లుంగి ఎన్గిడీ కూడా ఆడటం లేదని మార్క్రమ్ వెల్లడించాడు. గాయంతో బాధ పడుతున్న ఎన్గిడీ స్థానంలో కొత్త కుర్రాడు లిజాడ్ విలియమ్స్ ఆడుతున్నాడని, అతనికి ఇదే వరల్డ్ కప్ డెబ్యూ అని తెలిపాడు. బంగ్లా కెప్టెన్ తను పూర్తిగా ఫిట్‌గా ఉన్నట్లు వెల్లడించాడు.

తమ జట్టులో తౌహీద్ హృదోయ్ స్థానంలో తను వచ్చినట్లు తెలిపాడు. ముందుగా బౌలింగ్ చేయడం తమకేం సమస్య కాదన్నాడు. సౌతాఫ్రికాను ఒక మోస్తరు స్కోరుకు పరిమితం చేయగలిగితే, ఛేజ్ చేసేస్తామని అన్నాడు. తమ టీం బెస్ట్ క్రికెట్ ఆడాల్సి ఉంటుందని చెప్పాడు.

సౌతాఫ్రికా జట్టు: క్వింటన్ డీ కాక్, రీజా హెండ్రిక్స్, రాసీ వాన్ డర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిక్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో యాన్సెన్, గెరాల్డ్ కోట్జీ, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, లిజాడ్ విలియమ్స్

బంగ్లాదేశ్ జట్టు: తంజీద్ హసన్, లిటాన్ దాస్, నజ్ముల్ హొస్సేన్ షాంటో, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముస్తాఫిజుర్ రహీమ్, మెహదీ హసన్ మిరాజ్, మహ్మదుల్లా, నాసుమ్ అహ్మద్, హసన్ మహమూద్, షోరిఫుల్ ఇస్లామ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్

Story first published: Tuesday, October 24, 2023, 14:15 [IST]
Other articles published on Oct 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+