World Cup 2023: సంజూ యాటిట్యూడ్ మార్చుకో.. లేదంటే ఇక నీ గతి అంతే: మాజీ పేసర్
వరల్డ్ కప్ టీంలో కేరళ యంగ్‌స్టర్ సంజూ శాంసన్‌కు అవకాశం దక్కలేదు. దీనిపై ఫ్యాన్స్ చాలా నిరాశ చెందారు. అయితే అదే రాష్ట్రానికి చెందిన మాజీ పేసర్ శ్రీశాంత్ మాత్రం సెలెక్టర్ల నిర్ణయం సరైందే అన్నాడు. వన్డేల్లో సంజూ ఇటీవలి కాలంలో చక్కగా రాణిస్తున్నాడు. అయినా అతనికి అవకాశం దక్కకపోవడంపై ఫ్యాన్స్ మండిపడుతున్న సంగతి తెలిసిందే.
సంజూ తన యాటిట్యూడ్ మార్చుకోవాలని, దిగ్గజాల మాట విని పరిస్థితికి తగ్గట్లు ఆడేందుకు ప్రయత్నించాలని శ్రీశాంత్ చెప్పాడు. ఆసియా క్రీడలకు వెళ్తున్న ఇండియా-బి టీంలో కూడా సంజూకు (Sanju Samson) చోటు దక్కలేదు. అతని కన్నా తక్కువ సగటు ఉన్న సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలకు సెలెక్టర్లు అవకాశాలు ఇస్తున్నారు.

'సెలెక్టర్ల నిర్ణయం సరైందే అనుకుంటున్నా. ఎందుకంటే ప్లేయర్ తనను తాను ముందు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. గవాస్కర్, హర్ష భోగ్లే, రవిశాస్త్రి అందరూ సంజూ గురించి చాలా గొప్పగా చెప్తారు. అతని సత్తా విషయంలో ఎలాంటి అనుమానం లేదు. కానీ సమస్య తన అప్రోచ్‌తోనే. పిచ్‌ను బట్టి ఆడాలని ఎవరైనా చెప్తే సంజూ (Sanju Samson) వినడు. ఆ యాటిట్యూడ్ మార్చుకుంటే తనకు చాలా మంచిది' అని శ్రీశాంత్ తెలిపాడు.
తను సంజూను కలిసిన ప్రతిసారి ఒకటే సలహా ఇస్తానని శ్రీశాంత్ చెప్పాడు. 'వికెట్‌ను అర్థం చేసుకో. కొంచెం నిదానంగా ఆడు. ప్రతిబౌలర్‌నూ టార్గెట్ చేయకు. ఆలోచించుకో. నువ్వు ఏ బౌలర్ బౌలింగ్ అయినా ఆడగలవు. కాకపోతే కొంచెం వెయిట్ చెయ్. అవకాశం కోసం చూడు' అనే చెప్తా అన్నాడు. సంజూ (Sanju Samson) అనవసర షాట్లు ఆడి అవుటైపోతుంటాడని పేర్కొన్నాడు.
'నాతోసహా సంజూకు (Sanju Samson) మద్దతు ఇచ్చే మలయాళీలంతా కూడా తనకు ఎక్కువ అవకాశాలు రాలేదంటారు. కానీ ఆ మాట అనలేం. ఐర్లాండ్, శ్రీలంకపై తనకు అవకాశాలు దక్కాయి. పదేళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నాడు. కానీ ఇప్పటి వరకు కేవలం మూడు సెంచరీలే చేశాడు. ఎక్కడా నిలకడగా రాణించింది లేదు' అని శ్రీశాంత్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications