Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: చరిత్రలో ఇంత చెత్త ప్రదర్శన చూడలేదు.. పాక్ టీంను ఏకిపారేశాడుగా!

ఈ వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఫేవరెట్లలో ఒకటిగా పాకిస్తాన్‌ను చెప్పుకున్నారు. కానీ టోర్నీ ఆరంభమైన తర్వాత పాకిస్తాన్ టీం దారుణంగా తడబడింది. ప్రాక్టీస్ మ్యాచుల్లో ఘోరంగా ఓడింది. ఆ తర్వాత రెండు విజయాలు సాధించిన ఆ జట్టు.. ఆ తర్వాత మళ్లీ ఓటముల బాట పట్టింది.

మొత్తంగా ఆడిన 9 మ్యాచుల్లో కేవలం నాలుగింట మాత్రమే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఇదే ఫలితంతో స్వదేశం చేరుకుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ దిగ్గజం సల్మాన్ బట్ ఈ టీంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వరల్డ్ కప్ టోర్నీల్లో పాకిస్తాన్ ఇంతకన్నా ఘోరమైన ప్రర్శన ఎవరూ చేయలేదని అన్నాడు.

World Cup 2023 Salman Butt calls Pakistan team worst performance ever

'ఇలా ఐదు మ్యాచుల్లో పాకిస్తాన్ ఓడిపోయిన మరో టోర్నీనే నాకు గుర్తు రావడం లేదు. చివరగా పాక్ ఆడిన రెండు, మూడు కీలక టోర్నీలను గమనిస్తే.. పాక్ ఇంతలా తేలిపోవడం ఎప్పుడూ జరగలేదు. ఈ మెగాటోర్నీలో పాక్ ప్రదర్శన అత్యంత దారుణంగా ఉంది. ఇంత కన్యా చెత్త ప్రదర్శన నేనెప్పుడూ చూడలేదు' అని బట్ చెప్పాడు.

'అలాగే భారత్‌లో పరిస్థితులు కూడా పాక్‌లాగే ఉంటాయని, కాబట్టి ఇక్కడి పరిస్థితులు తమకు తెలియవనే కుంటి సాకులు కూడా చెప్పలేరు' అని బట్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ ప్రదర్శన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మించిది. మొత్తం 9 మ్యాచుల్లో కేవలం నాలుగు మ్యాచుల్లోనే నెగ్గిన ఈ జట్టు.. టోర్నీలో తమ మార్కు చూపించకుండానే పెవలియన్ చేరింది.

ఈ మెగా టోర్నీలో అఫ్రిదీ 18 వికెట్లు, రవూఫ్ 11 వికెట్లు తీసుకున్న మాట వాస్తవమే. కానీ వీళ్లు ధారాళంగా పరుగులు ఇచ్చేశారు. ఏ ప్రధాన బ్యాటర్ కూడా వీళ్లను అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఇక బాబర్ ఆజమ్ కూడా ఈ టోర్నీలో పెద్దగా రాణించలేదు. మొత్తం 9 మ్యాచులు ఆడిన అతను కేవలం 320 పరుగులు మాత్రమే చేశాడు.

Story first published: Tuesday, November 14, 2023, 12:56 [IST]
Other articles published on Nov 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+