Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rohit Sharma: ఇన్నేళ్ల తర్వాత బంతి పట్టుకున్న రోహిత్.. బంగ్లాకు చుక్కలు చూపించడానికి రెడీనా?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నెట్స్ లో చెమటోడ్చి ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్.. "బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో రోహిత్ ఏదో సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లున్నాడే..!" అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే దీనికి కారణం హిట్ మ్యాన్ నెట్స్ లో బ్యాటింగ్ కి బదులు బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుండడమే.

భారత్ తన నెక్స్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడబోతోంది. ఆసియా కప్ లో అన్ని జట్లపై గెలిచిన భారత్ బంగ్లాదేశ్ చేతిలో మాత్రం ఓడిపోయింది. దీంతో ఆ జట్టును తక్కువంచనా వేయకుండా దీటుగా ఎదుర్కోవాలని భారత్ భావిస్తోంది. అందుకే దానికి తగ్గట్లు ప్లాన్లు కూడా రెడీ చేస్తోంది. రోహిత్ నెట్స్ లో ప్రాక్టీస్ చేయడం కూడా అందులో భాగంలానే కనిపిస్తోంది.

World Cup 2023 Rohit started his bowling practice ahead of Bangladesh clash

ఆస్ట్రేలియా జట్టులో మ్యాక్స్ వెల్, ఇంగ్లాండ్ జట్టులో జో రూట్, మొయీన్ అలీ, బంగ్లాదేశ్ లో ఆ జట్టు కెప్టెన్ షకిబ్ అల్ హసన్ వంటి ఆటగాళ్ళు ఆ జట్టుకు ఎంతో కీలకంగా ఉన్నారు. కానీ టీమిండియాకు మాత్రం ఎన్నో ఏళ్లుగా సరైన స్పిన్ ఆల్-రౌండర్ దొరకడం లేదు. ముఖ్యంగా యువరాజ్ సింగ్ తర్వాత మరెవ్వరూ ఆ స్థానాన్ని భర్తీ చేయలేకపోయారు. రవీంద్ర జడేజా కొన్నాళ్ళపాటు ఆ స్థానంలో ఆడినా ఎక్కువరోజులు నిలుపుకోలేక పోయాడు. దీంతో సమస్యకు పరిష్కారం లేకుండా పోయింది.

ఈ సమస్య గురించే వరల్డ్ కప్ ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా రోహిత్ వివరించాడు. జట్టులో సరైన స్పిన్ ఆల్-రౌండర్ లేరని, సాధ్యమైనంత మంది ఆల్-రౌండర్లతో బరిలోకి దిగుతామన్నాడు. దానికోసం అవసరమైతే తాను కూడా బౌలింగ్ వేయడానికి రెడీగా ఉంటానన్నాడు.

ఇక ఇప్పుడు రోహిత్ నెట్స్ లో బౌలింగ్ ప్రాక్టీస్ చేయడంతో బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో రోహిత్ బౌలింగ్ వేసి సర్ ప్రైజ్ ఇస్తాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి నిజంగానే రోహిత్ బౌలింగ్ చేస్తాడా..? ఇప్పటి వరకు టోర్నీలో బ్యాట్ తో ప్రత్యర్థుల దుమ్ము దులిపిన రోహిత్.. ఇప్పుడు బంతి తోనూ మాయ చేయబోతున్నాడా..? అనేది తెలియాలంటే మ్యాచ్ వరకు ఆగాల్సిందే

Story first published: Wednesday, October 18, 2023, 7:12 [IST]
Other articles published on Oct 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+