Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsNZ: పాండ్యా లేడని శార్దూల్‌ను పక్కన పెట్టాం: రోహిత్ శర్మ

వరల్డ్ కప్‌లో ఓటమే లేకుండా దూసుకుపోతున్న టీమిండియా.. ఇప్పుడు న్యూజిల్యాండ్ రూపంలో పటిష్ఠ ప్రత్యర్థిని ఎదుర్కోబోతోంది. దీంతో జట్టులో కొన్ని కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా గాయం కారణంగా జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యాతో పాటు పెద్దగా ఫాంలో లేని శార్దూల్‌ ఠాకూర్‌లను పక్కన పెట్టి వాళ్ల స్థానంలో స్కై, షమీలను తీసుకుంది.

ధర్మశాల వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌ మ్యాచ్‌లో టీమిండియా, న్యూజిల్యాండ్ తలపడబోతున్నాయి. ఈ టోర్నీలో రెండు జట్లూ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. దీంతో ఈ మ్యాచ్‌ ఇరు జట్లకు చాలా కీలకం కానుంది. అలాగే ఈ పిచ్‌పై భారీ స్కోర్లు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

 World Cup 2023 Rohit Sharma Makes key changes against New Zealand

టాస్ గెలిచిన రోహిత్ శర్మ.. బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించేలా ఉందని, అలాగే సెకండ్ ఇన్నింగ్స్ సమయానికి పిచ్‌లో పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేనందువల్లే బ్యాటింగ్ తీసుకున్నామన్నాడు. అలాగే మంచు కూడా ముందుగానే పడే అవకాశం ఉండడం వల్ల అది తమకు కలిసొస్తుందన్నాడు.

ప్రత్యర్థిని తక్కువ స్కోరుకు కట్టడి చేయగలిగితే విజయం సాధించడం సులువవుతుందన్నాడు. అలాగే గాయం కారణంగా హార్దిక్ పాండ్యా జట్టుకు దూరమయ్యాడని, శార్దూల్‌ను కూడా పక్కన పెట్టి.. వాళ్ల స్థానంలో సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీలను తీసుకున్నట్లు హిట్ మ్యాన్ చెప్పాడు.

ఇక పిచ్ విషయానికొస్తే మునుపటి మ్యాచ్‌తో పోల్చితే గడ్డి తక్కువగా ఉంది. అయితే దీనివల్ల పెద్దగా ఎలాంటి ప్రభావం ఉండపోవచ్చు. ఎక్కువగా బ్యాటింగ్‌కే అనుకూలించేలా కనిపిస్తోంది. మరి ఈ పిచ్‌పై ఇన్‌ ఫామ్ న్యూజిల్యాండ్ బ్యాటర్లను భారత బౌలర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమి, కుల్‌దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.

న్యూజిల్యాండ్ జట్టు:
డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్ (కెప్టెన్, వికెట్ కీపర్), డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్, మార్క్ చాప్‌మన్, మిచెల్ శాంట్నర్, మ్యాట్ హెన్రీ, లోకీ ఫెర్గ్యూసన్, ట్రెంట్ బౌల్ట్.

Story first published: Sunday, October 22, 2023, 14:09 [IST]
Other articles published on Oct 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+