Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rohit Sharma: మెరుగైన రోహిత్ ర్యాంక్.. కోహ్లీని దాటేశాడుగా..!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌10లోకి దూసుకొచ్చాడు. ఆప్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌లపై ఆడిన సక్సెస్‌ఫుల్ ఇన్నింగ్స్ దెబ్బకు ఏకంగా 5 స్థానాలు ఎగబాగి టాప్ 6లోకి చేరుకున్నాడు. దీంతో టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీని దాటేశాడు.

వరల్డ్ కప్‌ 2023లో సూపర్ ఫాంతో కొనసాగుతున్న హిట్ మ్యాన్.. జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌‌లో ఫెయిల్ అయినా ఆ తర్వాత ఆఫ్ఘన్‌తో మ్యాచ్‌లో సెంచరీ (131) బాది ఫాంలో కొచ్చాడు. ఆ తర్వాత పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కూడా 82 పరుగుల అద్వితీయమైన ఇన్నింగ్స్ ఆడి ఒంటిచేత్తో భారత్‌ను గెలిపించాడు. దీంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ 5 ర్యాంకులు మెరుగు పరుచుకున్నాడు.

World Cup 2023 Rohit Sharma climbed to top 10 in ICC ODI batting rankings

వన్డే వరల్డ్ కప్ ముందు రోహిత్ శర్మ అటు ఇటుగా 700 పాయింట్లతో 11వ ర్యాంకులో ఉన్నాడు. అయితే ఆప్ఘన్, పాక్‌లపై ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌తో 15 పాయింట్లకు పైగా పెంచుకుని 5 ర్యాంకులు మెరుగు పరుచుకున్నాడు. ప్రస్తుతం 719 పాయింట్లతో 6వ ర్యాంకులోకి చేరుకున్నాడు.

ఇక రోహిత్ కెరీర్ బెస్ట్ వన్డే ర్యాంకింగ్ గురించి మాట్లాడితే.. 2018లో హిట్ మ్యాన్ వన్డేల్లో రెండో ర్యాంకుకు చేరుకున్నాడు. ఆ తర్వాత ఫామ్‌లేమి కారణంగా చేజార్చుకున్నాడు.కాగా ఈ లిస్ట్‌లో పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్ 836 పాయింట్లతో టాప్‌‌లో కొనసాగుతున్నాడు. టీమిండియా తరపున ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 818 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ 711 పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇదిలా ఉంటే వరల్డ్ కప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆసీస్, ఆఫ్ఘన్, పాకిస్తాన్‌లతో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి టేబుల్ టాపర్‌గా నిలిచింది. రన్ రేట్ విషయంలో కూడా +1.821 రన్ రేట్‌తో టాప్‌లో ఉంది. ఇక 19వ తేదీన పూణే వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడబోతోంది.

Story first published: Wednesday, October 18, 2023, 16:01 [IST]
Other articles published on Oct 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+