Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: గిల్ కోలుకోలేదు.. టీంలో అదొక్కటే మార్పు: రోహిత్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ తొలి మ్యాచులో భారత జట్టు టాస్ ఓడింది. ఈ మ్యాచులో రెండు జట్ల కెప్టెన్లు తొలిసారి వరల్డ్ కప్‌లో తమ టీంకు సారధ్యం వహిస్తుండటం గమనార్హం. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తాము ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. పిచ్‌ను చూసిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం తమ టీంలో మంచి బ్యాలెన్స్ ఉందన్నాడు.

గేమ్ టైం, రెస్ట్ మధ్య కూడా మంచి బ్యాలెన్స్ దొరికిందని కమిన్స్ చెప్పుకొచ్చాడు. అలాగే తమ టీంలో ట్రావిస్ హెడ్ ఇంకా కోలుకోలేదని, అతను ఇంకా అడిలైడ్‌లోనే ఉన్నాడని వెల్లడించాడు. అతనితోపాటు స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్ కూడా పూర్తిగా ఫిట్‌గా లేడని, దాంతో అతను కూడా ఈ మ్యాచ్ ఆడటం లేదని చెప్పాడు.

 World Cup 2023 Rohit reveals Gill not playing first match

తొలి వరల్డ్ కప్ మ్యాచ్ ఆరంభంలో స్టేడియం చాలా వరకు ఖాళీగా కనిపించినా.. ఈ మ్యాచ్‌కు మాత్రం టాస్ సమయానికే స్టేడియం సగం నిండిపోవడం గమనార్హం. ఇక భారత్ విషయానికొస్తే శుభ్‌మన్ గిల్ ఇంకా కోలుకోలేదని రోహిత్ స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు గిల్‌కు డెంగ్యూ సోకిన సంగతి తెలిసిందే.

Shubman Gill

మ్యాచ్ సమయానికి అతను కోలుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదని, గిల్ స్థానంలో ఇషాన్ కిషన్ తనకు జోడీగా ఓపెనింగ్‌కు వస్తాడని రోహిత్ చెప్పాడు. ఇక్కడి పరిస్థితులు బౌలర్లకు బాగా సహకరిస్తాయని భావిస్తున్నట్లు రోహిత్ చెప్పుకొచ్చాడు. మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ నుంచి బాగా టర్న్ లభిస్తుందని అభిప్రాయపడ్డాడు. వరల్డ్ కప్ కోసం అన్ని రకాలుగా తాము రెడీ అయ్యామని, అవసరమైన అన్ని బేసెస్ కవర్ చేశామని చెప్పాడు.

ఆసీస్ టీం: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్,స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్

టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్

Story first published: Sunday, October 8, 2023, 14:09 [IST]
Other articles published on Oct 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+