Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsNZ: రోహిత్ హిస్టరీ క్రియేట్ చేస్తాడా?.. కివీస్‌ గోడ బద్దలు కొడతాడా?

ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు ఓటమెరుగని న్యూజిల్యాండ్, భారత్ జట్లు తలపడేందుకు రెడీ అవుతున్నాయి. ధర్మశాల వేదికగా జరగనున్న ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారని ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు. అయితే ఈ రెండు టీమ్స్ తలపడిన హిస్టరీపై ఒక లుక్కేస్తే విజేత ఎవరో చెప్పడం అంత ఈజీ కాదని అర్థమైపోతుంది.

ఈ మెగాటోర్నీలో ఆసీస్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లను భారత్ ఓడించగా.. ఇంగ్లండ్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ టీమ్స్‌ను కివీస్ ఓడించింది. అయితే ఈ మ్యాచులో మాత్రం భారత్‌పై కాన్ఫిడెంట్‌గా కివీస్ బరిలో దిగుతుంది. ఎందుకంటే 2003 నుంచి ఐసీసీ టోర్నీల్లో భారత్ చేతిలో కివీస్ ఒక్కసారి కూడా ఓడిపోలేదు. 2019 వరల్డ్ కప్ సెమీస్, 2020 టీ20 వరల్డ్ కప్‌లలో కూడా భారత్‌ను కివీస్ ఓడించిన సంగతి తెలిసిందే.

World Cup 2023 Rohit needs to create history to win INDvsNZ clash

అయితే ప్రస్తుతం మంచి జోరుమీదున్న భారత్.. ఈ చరిత్రను తిరగరాయాలని ఉవ్విళ్లూరుతోంది. కానీ హార్దిక్ పాండ్యా వంటి కీలక ప్లేయర్‌కు గాయం అవడం, అతని స్థానంలో జట్టులోకి వస్తాడనుకున్న సూర్యకుమార్ యాదవ్‌కు కూడా ప్రాక్టీస్ సమయంలో గాయమవడం, ఇవన్నీ చూస్తుంటే భారత్ గెలవాలంటే చాలా కష్టడక తప్పేలా లేదు. ఓవరాల్‌గా వన్డే రికార్డులు చూసుకుంటే మాత్రం కివీస్‌పై భారత్ పైచేయి సాధించింది.

ఈ రెండు టీమ్స్ మొత్తం 116 వన్డేల్లో తలపడ్డాయి. వీటిలో భారత్ 58 విజయాలు సాధించగా.. కివీస్ 50 విజయాలు నమోదు చేసింది. ఒక్క మ్యాచ్ టై అయింది. ఏడు మ్యాచుల్లో ఫలితం తేలలేదు. ఇక వన్డే వరల్డ్ కప్‌ల విషయానికొస్తే.. భారత్, కివీస్ జట్టు 8 సార్లు వన్డే వరల్డ్ కప్‌లలో తలపడ్డాయి. వీటిలో 5 సార్లు కివీస్ నెగ్గగా.. భారత్ మూడుసార్లే విజయం నమోదు చేసింది. ఇక 2019 వరల్డ్ కప్ సెమీస్‌లో కివీస్ చేతిలో భారత్ ఓడిన మ్యాచ్‌ను ఫ్యాన్స ఎప్పటికీ మర్చిపోలేరు కదా.

Story first published: Sunday, October 22, 2023, 9:56 [IST]
Other articles published on Oct 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+