Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rohit Sharma: వరల్డ్ కప్‌లో అశ్విన్ ఆడతాడా?.. రోహిత్ ఇచ్చిన హింట్ ఇదే!

వరల్డ్ కప్‌ ముందు టీమిండియాకు ఒక పెద్ద సమస్య వచ్చింది. ఈ మెగా టోర్నీ జరిగేది భారత్‌లో. దీంతో స్పిన్నర్లు ప్రతి జట్టులో కీలకం కానున్నారు. ఈ క్రమంలోనే భారత జట్టులో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌ను తీసుకున్నారు. వీళ్లు ముగ్గురే భారత స్పిన్ బౌలింగ్ విభాగాన్ని ముందుకు తీసుకెళ్తారని అంతా అనుకున్నారు.

అయితే అక్షర్, జడేజా ఇద్దరూ దాదాపు ఒకేలా బౌలింగ్ చేస్తారు. అలాగే అక్షర్ బౌలింగ్ పెద్ద ప్రభావం చూపడం లేదు. దీంతో అతని ఎంపికపై కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. కానీ బ్యాటుతో రాణించిన అక్షర్ తన ఎంపిక సరైనదే అని నిరూపించే ప్రయత్నం చేశాడు. బంగ్లాదేశ్‌పై అయితే జట్టును గెలిపించినంత పని చేశాడు.

Ravichandran Ashwin Rohit Sharma

కానీ ఆ మ్యాచులోనే అక్షర్‌కు గాయాలయ్యాయి. చిన్న చిన్న గాయాలు పక్కన పెట్టినా అతని తొడ కండరాలకు పెద్ద గాయమైంది. దీంతో అతను ఆసియా కప్ ఫైనల్ ఆడలేదు. అతనికి గాయం అవడంతో వెంటనే రిప్లేస్‌మెంట్ కోసం వాషింగ్టన్ సుందర్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. దీని గురించి మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడాడు.

'స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా అశ్విన్ కూడా పరిగణనలో ఉన్నాడు. ఫ్లైట్‌లో ఉండగా నేను తనతోనే మాట్లాడుతున్నా. అక్షర్‌కు చివరి నిమిషంలో గాయమైంది. వాషింగ్టన్ అందుబాటులో ఉన్నాడు. దాంతో అతన్ని ఈ పాత్ర కోసం పిలిపించాం' అని రోహిత్ చెప్పాడు. వరల్డ్ కప్‌లో భారతీయ స్పిన్ పిచ్‌లపై అశ్విన్ లేదా చాహల్‌ను జట్టులోకి తీసుకోవాలని పలువురు సూచించారు.

అయితే బ్యాటుతో కూడా రాణించే సత్తా ఉన్న అశ్విన్‌కు ఎక్కువ మంది ఓటేస్తున్నారు. అలాగే ఈ వరల్డ్ కప్‌లో ఆడితే.. అదే అశ్విన్ కెరీర్‌లో చివరి వరల్డ్ కప్ అవుతుందని కూడా పలువురు చెప్తున్నారు. భారత పిచ్‌లపై చెలరేగే అశ్విన్.. వరల్డ్ కప్‌లో టీమిండియాను గెలిపించే సత్తా ఉన్న ఆటగాడు అని ఫ్యాన్స్ కూడా అంటున్నారు.

Story first published: Monday, September 18, 2023, 14:52 [IST]
Other articles published on Sep 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+