Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Subhman Gill: గిల్ కోలుకోవడం అంత ఈజీ కాదు.. మ్యాచ్ ఆడాలంటే నరకమేనట..!

డెంగ్యూతో బాధపడుతున్న టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ జట్టులోకి కంబ్యాక్ ఇవ్వడం కష్టమేనని మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప అన్నాడు. ఇదే తరహా సిట్యుయేషన్‌ను తాను ఎదుర్కొన్నానని, అందుకే గిల్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో అర్థం చేసుకోగలనని ఊతప్ప చెప్పుకొచ్చాడు.

టీమిండియా స్టార్ ఓపెనర్ గిల్ గత కొద్ది రోజులుగా డెంగ్యూతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే వరల్డ్ కప్ 2023లో తొలి రెండు మ్యాచ్‌లకు కూడా దూరమయ్యాడు. ఇక భారత్ తన మూడో మ్యాచ్‌లో పాకిస్తాన్‌‌తో తపపడబోతోంది. కానీ అప్పటికి కూడా గిల్ కోలుకుంటాడనే నమ్మకం లేదు.

Robin Uthappa says that comeback will not be easy for Gill

ప్రస్తుతం చెన్నైలోని హోటల్లో విశ్రాంతి తీసుకుంటున్న గిల్‌ని ఎప్పటికప్పుడు మెడికల్ టీం పరిశీలిస్తోంది. బుధవారం గిల్‌ను చెన్నైలోని ఆసుపత్రికి కూడా తీసుకెళ్లి చెకప్ చేయించారు. దీంతో గిల్ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే గిల్ గురించి ఊతప్ప కీలక కామెంట్స్ చేశాడు.

ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌కి ముందు రాబిన్ ఊతప్ప తన యూట్యూబ్ చానల్‌లో మ్యాచ్ పరిస్థితులను విశ్లేషించాడు. అదే సమయంలో గిల్ ఆరోగ్యం గురించి ప్రస్తావిస్తూ.. 'గిల్ త్వరగా కోలుకోవాలని, జట్టులోకి త్వరగా తిరిగి రావాలని మనందరం కోరుకుందాం. కానీ డెంగ్యూ నుంచి కోలుకుని బలమైన కంబ్యాక్ ఇవ్వడం చాలా కష్టం' అని చెప్పుకొచ్చాడు.

ఫిజికల్‌గా డెంగ్యూ చాలా దెబ్బతీస్తుందని, సరిగ్గా ఇలాంటి పరిస్థితులనే తాను కూడా ఎదుర్కొన్నానని అన్నాడు. డెంగ్యూ నుంచి కోలుకున్న తర్వాత కూడా కొంతకాలం వరకు ఎముకల్లో నొప్పి అలాగే ఉంటుందని, గిల్‌పై దీని ప్రభావం ఎక్కువగా ఉండకూడదని కోరుకుంటున్నానంటూ ఊతప్ప పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే గిల్ ఆరోగ్యంపై టీమ్ హెడ్ కోచ్ విక్రమ్ రాథోడ్ కీలక అప్‌డేట్ ఇచ్చాడు. గిల్ వేగంగా కోలుకుంటున్నాడని, ముందు జాగ్రత్తగానే హాస్పిటల్‌కి తీసుకెళ్లి చెకప్ చేయించాం కానీ, భయపడాల్సిందేమీ లేదని చెప్పుకొచ్చాడు. త్వరలోనే గిల్ పూర్తి స్థాయిలో కోలుకుని జట్టులోకి తిరిగొస్తాడని భరోసా ఇచ్చాడు.

Story first published: Wednesday, October 11, 2023, 17:16 [IST]
Other articles published on Oct 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+