Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: ధోనీని కాపీ కొట్టబోయిన రిజ్వాన్.. అట్టర్ ఫ్లాప్! (వీడియో)

క్రికెట్ చరిత్రలో బెస్ట్ వికెట్ కీపర్ల పేర్లు చెప్పాల్సి వస్తే.. అందరి మదిలో ముందుగా మెదిలే పేర్లలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఒకడు. తన అద్భుతమైన రిఫ్లెక్స్‌లు తెలివైన వ్యూహాలతో ప్రపంచ క్రికెట్‌లో తన కన్నా బెటర్ వికెట్ కీపర్ లేడని ధోనీ నిరూపించుకున్నాడు. అలాంటి ధోనీని కాపీ కొట్టడం అందరి వల్ల కాదు కదా.

ఇంగ్లండ్‌తో పాకిస్తాన్ ఆడిన మ్యాచులో పాక్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ కూడా ధోనీలా తెలివిగా వికెట్ కీపింగ్ చేద్దామని అనుకున్నాడు. కానీ అది బెడిసికొట్టింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో ఇంగ్లండ్‌కు మంచి ఆరంభమే దక్కింది.

World Cup 2023 Rizwan Tried To Do A Dhoni but failed miserably

ఆ తర్వాత బెన్ స్టోక్స్, జో రూట్ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ సమయంలోనే స్టోక్స్ బ్యాటింగ్ చేసే సమయంలో పాక్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ బంతి అందుకున్నాడు. అతను లెగ్ సైడ్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ ఆడేందుకు స్టోక్స్ ప్రయత్నించాడు. కానీ మిస్ అయ్యాడు. అప్పుడు కీపర్ రిజ్వాన్ వెంటనే బ్యాటర్ లెగ్ సైడ్ దూకి దాన్ని ఆపబోయాడు.

ఇలాంటి డెలివరీలను చేతులతో ఆపడం చాలా కష్టం. అందుకే ధోనీ కూడా చటుక్కున రెండు కాళ్లు దగ్గరకు చేర్చి బంతి తనను దాటి వెళ్లకుండా అడ్డుకునే వాడు. రిజ్వాన్ కూడా అదే చేద్దామని అనుకున్నాడు. కానీ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో ఆ బంతి అతని కాళ్ల మధ్యలో నుంచి వెనక్కు వెళ్లి బౌండరీ రోప్‌ను తాకింది.

ఇది చూసిన కామెంటేటర్ నాసిర్ హుస్సేన్ కూడా.. 'ధోనీలా బంతిని అడ్డుకోవడానికి రిజ్వాన్ ప్రయత్నించాడు. కానీ ఫెయిలయ్యాడు' అని కామెంట్ చేశాడు. ఫ్యాన్స్ కూడా అందరూ ధోనీలా ట్యాలెంటెడ్ ఉండరంటూ రిజ్వాన్‌ను ట్రోల్ చేస్తున్నారు.

Story first published: Sunday, November 12, 2023, 17:27 [IST]
Other articles published on Nov 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+