For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నెంబర్ ఫోర్ సమస్యకు ఎవరూ ఊహించని సజెషన్.. టీమిండియా ఒప్పుకుంటుందా?

మరికొన్ని రోజుల్లో వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది. ఈసారి కూడా ఫేవరెట్లలో ఒకటిగా టీమిండియా ఈ టోర్నీలో దిగుతుంది. అయితే ఈ టోర్నీలో కూడా టీమిండియాను ఇక ప్రధాన సమస్య ఇబ్బంది పెడుతోంది. అదే నెంబర్ 4 బ్యాటర్ సమస్య.

గత వరల్డ్ కప్‌లో కూడా ఈ స్థానంలో ఆడే బ్యాటర్ సమస్య టీమిండియాను తెగ ఇబ్బంది పెట్టింది. దీని గురించి తాజాగా టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి మాట్లాడాడు. ఎవరూ ఊహించని సలహా ఇచ్చాడు. టీమిండియా నెంబర్ ఫోర్ సమస్య తీర్చే సత్తా ఒక్కడికే ఉందన్నాడు.

 World Cup 2023 Ravi Shastri wants Virat Kohli to bat at number four

ప్రస్తుతం టీమిండియాలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీని నాలుగో నెంబర్‌లో ఆడించాలని రవిశాస్త్రి చెప్పాడు. తాను టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్నప్పుడే ఈ సజెషన్ ఇచ్చానని, కానీ ఆ సమయంలో అమలు కాలేదని గుర్తుచేసుకున్నాడు.

ఇలా కోహ్లీని ఒక స్థానం కిందకు దింపడం వల్ల మిడిలార్డర్ బలం పెరుగుతుందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. 'టీమిండియా కోసం నాలుగో నెంబర్‌లో ఆడటానికి విరాట్ కోహ్లీ ఎప్పుడూ రెడీనే. గత రెండు వరల్డ్ కప్‌లలో కూడా ఇదే సలహా ఇచ్చా. నేను కోచ్‌గా ఉన్నప్పుడు కూడా దీని గురించి చర్చించా' అని చెప్పుకొచ్చాడు.

టీమిండియా టాపార్డర్ చాలా బలంగా ఉందని, కానీ మిడిలార్డర్‌ ఆశించినంత బలంగా లేదని అభిప్రాయపడ్డాడు. ఈ సమస్యకు చెక్ పెట్టాలన్నా కూడా కోహ్లీని నాలుగో స్థానంలో పంపడమే బెటర్ అని శాస్త్రి అన్నాడు. అందుకే 2019 వరల్డ్ కప్‌లో ధోనీ, కోహ్లీతో ఈ విషయం చర్చించాలని అనుకున్నట్లు చెప్పాడు.

'టాపార్డర్‌లో రెండు, మూడు వికెట్లు పోతే టీమిండియా ఓడిపోయినట్లే. ఇది చాలాసార్లు ప్రూవ్ అయింది. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి అనుభవం కావాలి. విరాట్ కోమ్లీ రికార్డు చూస్తే.. అతను నాలుగో స్థానంలో కూడా చక్కగానే రాణించాడు. కాబట్టి అతనే ఈ ప్లేస్‌లో కరెక్ట్' అని శాస్త్రి పేర్కొన్నాడు.

Story first published: Thursday, August 17, 2023, 8:59 [IST]
Other articles published on Aug 17, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+