For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

AFGvsPAK వరల్డ్ గెలిచినంద ఆనందంగా ఉంది: రషీద్ ఖాన్

AFGvsPAK: పాకిస్తాన్‌పై ఆఫ్ఘనిస్తాన్ చారిత్రక విజయం సాధించింది. ఈ విజయంతో ఆఫ్ఘన్ ఆటగాళ్లంతా సంబరాలు చేసుకున్నారు. పాకిస్తాన్‌పై గెలవడం ఎంతో ఆనందంగా ఉందంటూ మైదానంలోనే డ్యాన్స్‌లు కూడా చేశారు. ఇక ఆ జట్టు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అయితే పాక్‌పై గెలుపు వరల్డ్ గెలిచినంత ఆనందాన్నిచ్చిందన్నాడు.

సోమవారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు అద్భుత విజయం సాధించి వరల్డ్ కప్ టోర్నీలో చరిత్ర సృష్టించింది. పాకిస్తాన్‌పై ఇది ఆఫ్ఘన్ జట్టుకు వన్డేల్లో తొలి విజయం. ఇక ఈ గెలుపు వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీలో రావడంతో ఆఫ్ఘనిస్తాన్ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. మైదానంలోనే ఆటగాళ్లంతా తిరుగుతూ సెలబ్రేట్ చేసుకున్నారు. డ్రెస్సింగ్ రూంలో కూడా డ్యాన్సులు చేస్తూ రచ్చరచ్చ చేశారు.

 World Cup 2023 Rashid Khan says that winning against pakistan feels like winning World cup

ఈ విజయంపై స్పందించిన ఆఫ్ఘన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్.. పాక్‌పై గెలవడంతో ప్రపంచకప్ గెలిచినట్లు అనిపిస్తోందన్నాడు. 'ఈ మ్యాచ్ కు ముందు మేము పాకిస్తాన్ జట్టుతో 7 మ్యాచ్‌లు ఆడాం. ఒక్కటీ గెలవలేదు. కానీ సోమవారం జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై సూపర్ విక్టరీ సాధించాం. ఈ గెలుపు మాకు ప్రపంచకప్ గెలిచినంద ఆనందాన్నిస్తోంది. ఈ విజయంతో మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది' అని రషీద్ చెప్పుకొచ్చాడు.

తొలుత ఆఫ్ఘన్ బౌలర్ల దెబ్బకు పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 282 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత టార్గెట్ ఛేజింగ్‌లో ఆఫ్ఘన్ బ్యాటర్లు అదరగొట్టారు. ఓపెనర్లు ఇబ్రహీం జద్రాన్ (87), రహమానుల్లా గుర్బాజ్ (65) సూపర్ ఓపెనింగ్ ఇవ్వగా.. రహమత్ షా (77 నాటౌట్) చివరి వరకు క్రీజులో పాతుకుపోయి జట్టుకు విజయాన్నందించాడు. దీంతో 283 పరుగుల టార్గెట్‌ను కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 49 ఓవర్లలో ఆఫ్ఘన్ ఛేదించింది. కాగా.. ఆఫ్ఘన్ జట్టు 30వ తేదీన పూణే వేదికగా శ్రీలంకతో తలపడబోతోంది.

Story first published: Tuesday, October 24, 2023, 15:51 [IST]
Other articles published on Oct 24, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+