Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: ఈ స్టార్ బ్యాటర్ అబద్ధం చెప్పాడా?.. పేరు వెనుక కథేం లేదంటున్న తండ్రి!

Rachin Ravindra: ఈ వరల్డ్ కప్‌లో అద్భుతమైన ఆటతీరుతో అందర్నీ ఆకట్టుకున్న కుర్రాళ్లలో కివీస్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర ఒకడు. తన కెరీర్‌లో తొలి వరల్డ్ కప్ ఆడుతున్న అతను మూడు శతకాలతో అదరగొట్టాడు. కివీస్ బ్యాటింగ్‌ లైనప్‌కు వెన్నెముకలా మారాడు. తన అద్భుతమైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.

ఈ భారతీయ మూలాలున్న కుర్రాడి పేరు వెనుక పెద్ద కథే ఉందని ఫ్యాన్స్ అంటారు. రచిన్ కూడా తన పేరు వెనుక ఉన్న కథ ఇదేనంటూ పలు ఇంటర్వ్యూల్లో ఒక విషయం చెప్పాడు. భారత లెజెండరీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ ఇద్దరి పేర్లు కలిపి తనకు రచిన్ అని తల్లిదండ్రులు పేరు పెట్టారని పలుమార్లు అతను చెప్పాడు.

World Cup 2023 Rachin Ravindra father says there is no story behind the name

ఫ్యాన్స్ అందరూ కూడా ఈ కథ నమ్మేశారు. కానీ ఆ పేరు వెనుక అంత పెద్ద కథ లేదని రచిన్ తండ్రి రవి కృష్ణమూర్తి వెల్లడించాడు. బెంగళూరుకు చెందిన రవి దంపతులు ఆ తర్వాత ఉద్యోగ నిమిత్తం న్యూజిల్యాండ్ వెళ్లిపోయాడు. అక్కడే బిడ్డ పుట్టగా అతనికి రచిన్ అని పేరు పెట్టారు. ఈ పేరును తన భార్య ముందుగా సజెస్ట్ చేసిందని రవి తెలిపారు.

'రచిన్ పుట్టినప్పుడు మా ఆవిడ ఈ పేరు సజెస్ట్ చేసింది. దాన్ని డిసైడ్ చేయడానికి మాకు ఎక్కువ టైం కూడా పట్టలేదు. ఎందుకంటే ఆ పేరు స్పెలింగ్ చేయడానికి సింపుల్‌గా ఉంది, చిన్నగా ఉంది. దాంతో మేం ఆ పేరుకు అడిక్ట్ అయిపోయాం. ఆ పేరు పెట్టేసిన కొన్నేళ్ల తర్వాత ఆ పేరులో ఇలా సచిన్, రాహుల్ ద్రావిడ్ పేర్లు కలిసున్నాయని మాకు అర్థమైంది' అని రవి వివరించారు.

'మా అబ్బాయి క్రికెటర్ అవ్వాలనే ఉద్దేశ్యంతో తనకు ఆ పేరు పెట్టలేదు. అసలు తనను క్రికెటర్ చేయాలని మేం ఎప్పుడూ అనుకోలేదు కూడా' అని పేర్కొన్నాడు. ఏదేమైనా ఇద్దరు ఇండియన్ లెజెండ్ల పేర్లు కలిపి పెట్టుకున్న రచిన్.. ఈ ఏడాది వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. అలాగే 25 ఏళ్లలోపు వరల్డ్ కప్‌లలో అత్యధిక పరుగులు, సెంచరీలు చేసిన బ్యాటర్‌గా సచిన్ రికార్డు కూడా బద్దలు కొట్టాడు.

Story first published: Tuesday, November 14, 2023, 15:47 [IST]
Other articles published on Nov 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+