Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsPAK: బీసీసీఐపై పాకిస్తాన్ గుస్సా.. ఐసీసీకి కంప్లైంట్ చేసే ప్లాన్‌లో పీసీబీ!

భారత్ చేతిలో ఓటమి నుంచి పాకిస్తాన్ బయటపడలేకపోతోంది. మ్యాచ్‌లో దారుణంగా ఓడిపోవడం అటుంచితే గ్రౌండ్‌లో ప్రేక్షకుల తీరుపై పాకిస్తాన్ జట్టు చాలా కోపంగా ఉంది. దీంతో ఏకంగా భారతీయ క్రికెట్ బోర్డ్ మండలి.. బీసీసీఐపై ఐసీసీకి కంప్లైంట్ చేసేందుకు రెడీ అవుతోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.

అహ్మదాబాద్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయింది. ఓటమి బాధ అటుంచితే ఇప్పుడు పాకిస్తాన్ బాధంతా మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకుల తీరుపైనే. మొత్తం 1,32,000 సీటింగ్ ఉన్న స్టేడియం మొత్తం ఫ్యాన్స్‌తో నిండిపోయింది. అయితే వాళ్లంతా దాదాపు భారత అభిమానులే.

World Cup 2023 PCB is going to complain ICC on BCCI

లైవ్‌లో మ్యాచ్ చూడాలని ఆశపడిన పాకిస్తాన్ ఫ్యాన్స్‌కి కనీసం వీసాలు కూడా దొరకలేదు. దాంతో స్టేడియం మొత్తం నీలి సముద్రంలా మారిపోయింది. వాళ్లంతా టైం దొరికినప్పుడల్లా పాకిస్తాన్ ఆటగాళ్లను ఒత్తిడిలోకి నెట్టసాగారు.

మ్యాచ్ మొదలైనప్పటి నుంచే ఫ్యాన్స్ పాకిస్తాన్ ఆటగాళ్లను ఓ ఆట ఆడుకోవడం మొదలుపెట్టారు. టాస్ సమయంలోనే బాబర్ మాట్లాడేటప్పుడు ఫ్యాన్స్ అందరూ హేళనగా కేకలు వేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత రిజ్వాన్ అవుటైనప్పుడు ఏకంగా జై 'శ్రీరామ్, జై శ్రీరామ్' అంటూ నినాదాలు చేశారు.

ఇవన్నీ పాకిస్తాన్‌కు నచ్చకపోవడంతో ఆ జట్టు ఇప్పుడు దీనిపై ఐసీసీకి ఫిర్యాదు చేయబోతున్నట్లు టెలిగ్రాఫ్‌ వార్తా సంస్థ పేర్కొంది. దీనిపై పీసీబీ చీఫ్ జాకా అష్రఫ్ తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిపింది.

కాగా.. బుమ్రా బౌలింగ్‌లో రిజ్వాన్ అవుటై డ్రెస్సింగ్ రూం వైపు వెళుతున్నప్పుడు అక్కడున్న ఫ్యాన్స్ కొంతమంది జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే భారత్‌తో మ్యాచ్ ముందు పాకిస్తాన్ హైదరాబాద్ వేదికగా నెదర్లాండ్స్, శ్రీలంకతో మ్యాచ్‌లు ఆడింది. ఈ రెండు మ్యాచ్‌లలో పాకిస్తాన్ విజయం సాధించింది. అలాగే ఈ మ్యాచ్‌లలో చాలామంది పాకిస్తాన్‌ను సపోర్ట్ చేస్తూ నినాదాలు కూడా చేశారు. అలాగే పాకిస్తాన్ జట్టు భారత్ చేరుకున్నప్పుడు కూడా ఎయిర్ ‌పోర్ట్‌లో పాకిస్తాన్ జట్టును ఆహ్వానించడానికి ఎంతో మంది ఫ్యాన్స్ అక్కడకు చేరుకుని ఆ జట్టు ఆటగాళ్లతో సెల్ఫీలు కూడా దిగారు. ఈ వీడియోలు కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి.

Story first published: Monday, October 16, 2023, 12:49 [IST]
Other articles published on Oct 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+