ఈ ఏడాది ఆసియా కప్ కోసం భారత జట్టు కూడా పాకిస్తాన్ వెళ్లాల్సి వచ్చిన విషయం గుర్తుంది కదా. అప్పుడు బీసీసీఐ దీనికి ససేమిరా అనడంతో పాకిస్తాన్ మాజీలు ఒకరొకరే వచ్చి చాలా నీతులు చెప్పారు. రాజకీయాలను, క్రికెట్‌ను కలపడం కరెక్ట్ కాదని సలహాలు ఇచ్చారు. కానీ ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్ మాత్రం ఈ రెండింటినీ కలిపేసి భారత్‌ను తిట్టిపోస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
వరల్డ్ కప్ కోసం ఒక్కో దేశమే భారత్‌కు చేరుకుంటోంది. దాయాది పాకిస్తాన్ కూడా తాాజాగా భారత్‌కు వచ్చేసింది. ఇక్కడ పాక్ టీంకు కూడా ఘనమైన స్వాగతం లభించింది. ఇలా పాక్ టీంను సకల మర్యాదలతో చూసుకోవడంతో ఆ టీం ప్లేయర్లు కూడా తమకు దక్కిన స్వాగతం చూసి ఆశ్చర్యపోయారు. చాలా గొప్ప స్వాగతం లభించిందని చెప్పుకొచ్చారు.

ఇలా పాకిస్తాన్‌కు భారత్‌లో అతిథి మర్యాదలు జరుగతుంటే.. ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్ మాత్రం భారత్‌పై నిప్పులు చెరుగుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పాక్ టీం చాలా ధైర్యంగా ఉండాలని, శత్రుదేశంలో అయినా ఇంకెక్కడైనా టోర్నీ జరుగుతుంటే దేశం మొత్తం వాళ్లకు మద్దతు ఇవ్వాలని జాకా అష్రాఫ్ అనడం వినిపించింది.
ఈ వీడియో చూసిన భారత క్రికెట్ ఫ్యాన్స్ ముఖ్యంగా షాకైపోయారు. పాక్ టీంను ఇంత బాగా చూసుకుంటూ ఘనంగా భారతీయులు స్వాగతిస్తుంటే.. మరోవైపు జాకా అష్రాఫ్ వంటి వాళ్లు మాత్రం భారత్‌ను 'శత్రుదేశం' అంటున్నారని మండిపడ్డారు. పాకిస్తాన్ చెత్త బుద్ధి ఇలాగే ఉంటుందని మండిపడుతున్నారు. అంతేకాదు విదేశాలకు చెందిన ఫ్యాన్స్ కూడా దీనిపై ఆశ్చర్యంగా రియాక్ట్ అవుతున్నారు.
ఇలా పీసీబీ చైర్మన్.. భారత్‌ను శత్రుదేశంగా అభివర్ణించడం ఫ్యాన్స్‌కు ఏమాత్రం నచ్చలేదు. ఇలాంటి సమయంలో భారత్‌పై అష్రాఫ్ ఈ కామెంట్స్ చేయడం పెద్ద దుమారమే రేపుతోంది. ఒక దేశ క్రికెట్ బోర్డు చైర్మన్.. భారత్ గురించి ఇలాంటి కామెంట్స్ చేయడం పెద్ద గొడవకు దారి తీసే అవకాశం ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.
ఇది కచ్చితంగా భారత్‌ను అవమానించడమే అని కొందరు ఫీలవుతున్నారు. అసలే ఈ రెండు దేశాల మధ్య రాజకీయ సంబంధాలు సరిగా లేదు. దీంతో ద్వైపాక్షిక సంబంధాలు సరిగా లేని కారణంగా ఈ రెండు జట్ల మధ్య ఎలాంటి సిరీసులు జరగడం లేదు. కేవలం ఆసియా కప్, ఐసీసీ ట్రోఫీల్లోనే భారత్, పాకిస్తాన్ ఆడుతున్న సంగతి తెలిసిందే.