For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World Cup 2023: మొన్న కోహ్లీని తిడితే.. ఇప్పుడు పెద్ద పదవి ఇచ్చిన క్రికెట్ బోర్డు!

కొన్నిరోజుల క్రితమే టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీని తిట్టాడో పాక్ లెజెండ్. వాళ్లకు ఇది అలవాటేనని సరిపెట్టుకోవచ్చు కానీ..సౌతాఫ్రికాపై కఠినమైన పిచ్‌పై కష్టపడి కోహ్లీ చేసిన సెంచరీని సెల్పిష్ అంటూ మండిపడ్డాడు. అతనికి భారతీయులు గట్టి సమాధానం ఇచ్చేలోగా ఇంగ్లండ్ లెజెండ్ మైకేల్ వాన్ రిప్లై ఇచ్చాడు.

కోహ్లీ ఆటతీరు సెల్ఫిష్‌గా ఉందని, కావాలంటే రోహిత్ కూడా అలాగే ఆడొచ్చని, కానీ అతను అలా ఆడటం లేదని చెప్పాడు. ఈ గొడవ గురించి ఫ్యాన్స్ అలా మర్చిపోతుండగానే.. హఫీజ్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక బాధ్యతలు అప్పగించింది. పురుషుల పాకిస్తాన్ టీంకు అతన్ని డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమించింది.

World Cup 2023 PCB appoints Hafeez as Pak team director

పాకిస్తాన్ తరఫున ఓవరాల్‌గా 392 మ్యాచుల్లో ఆడిన హఫీజ్ సుమారు 13 వేల పరుగులు చేశాడు. అలాగే 250పైగా వికెట్లు కూడా తీసుకున్నాడు. ఇంత మంచి రికార్డు ఉన్న హఫీజ్‌ను తమ టీం డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమించినట్లు పీసీబీ ప్రకటించింది. 'మాజీ టెస్టు కెప్టెన్ మహమ్మద్ హఫీజ్‌ను పాకిస్తాన్ పురుషుల టీం డైరెక్టర్‌గా నియమిస్తున్నాం' అని పీసీబీ తెలిపింది.

'పాకిస్తాన్ తరఫున హఫీజ్ 55 టెస్టులు, 218 వన్డేలు, 119 టీ20లు ఆడాడు. వీటన్నింటిలో కలిపి 12,780 పరుగులు చేయడంతోపాటు 253 వికెట్లు కూడా తీసుకున్నాడు' అని పీసీబీ వెల్లడించింది. వరల్డ్ కప్‌లో పేలవమైన ప్రదర్శన చేసిన పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉన్న సంగతి తెలిసిందే.

తాజాగా ఆ టీం కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా తన పదవికి రాజీనామా చేశాడు. ఈ క్రమంలోనే వచ్చే ఆస్ట్రేలియా టూర్‌కు సంబంధించిన కొత్త కోచింగ్ స్టాఫ్‌ను పీసీబీ ప్రకటించింది. 'పాకిస్తాన్ కోచింగ్ స్టాఫ్ పోర్టిఫోలియోలను కూడా పీసీబీ మార్చేసింది. ఈ కోచ్‌లు అందరూ కూడా నేషనల్ క్రికెట్ అకాడమీలో పని చేస్తారు. త్వరలోనే పీసీబీ వీరిలో కొందర్ని జట్టు కోసం ఎంపిక చేస్తుంది' అని ప్రకటించింది.

Story first published: Thursday, November 16, 2023, 11:34 [IST]
Other articles published on Nov 16, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+