PAKvsSA: వరల్డ్ కప్‌లలో సౌతాఫ్రికాపై పాక్‌దే పైచేయి?
వరల్డ్ కప్‌లో చావో రేవో తేల్చుకోవడానికి పాకిస్తాన్ రెడీ అయింది. దీని కోసం బలమైన సౌతాఫ్రికాతో తలపడనుంది. ప్రస్తుతం ఈ రెండు టీమ్స్ ఫామ్ చూసిన ఎవరైనా సరే కచ్చితంగా సౌతాఫ్రికా విజయం సాధిస్తుందనే చెప్తారు. కానీ గత రెండు వరల్డ్ కప్‌లలో పాక్, సౌతాఫ్రికా తలపడిన రెండుసార్లు విజయం పాక్‌నే వరించిందని తెలుసా?
ఓవరాల్‌గా ఈ రెండు టీమ్స్ ఇప్పటి వరకు ఐదుసార్లు వరల్డ్ కప్‌లో తలపడ్డాయి. ఈ ఐదుసార్లలో తొలి మూడు సార్లు విజయం సౌతాఫ్రికానే వరించింది. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కలిస్, కెవిన్ పీటర్సన్ వంటి దిగ్గజాల తరం ముగిసింది. దీంతో సౌతాఫ్రికా జట్టు కూర్పు కూడా కొంత దెబ్బతిన్నది. చివరగా వరల్డ్ కప్‌లో పాక్‌పై సౌతాఫ్రికా గెలిచింది 1999లో కావడం గమనార్హం.

ఇలాంటి సమయంలో పాకిస్తాన్ జోరందుకుంది. బలమైన బ్యాటింగ్ లైనప్, మంచి బౌలింగ్ ఎటాక్‌ను సమకూర్చుకుంది. దీంతో 2015 వరల్డ్ కప్‌లో ఈ రెండు టీమ్స్ తలపడినప్పుడు విజయం సాధించింది. ఇక గత వరల్డ్ కప్‌లో అయితే సఫారీ బౌలింగ్‌ను పాక్ బ్యాటర్లు ఒక ఆట ఆడుకున్నారు. ఆ మ్యాచులో 7 వికెట్లు కోల్పోయిన పాక్.. నిర్ణీత 50 ఓవర్లలో 308 పరుగులు చేసింది.
అయితే ఇప్పుడు కూడా అదే స్కోరు చేసినా పాక్ గెలవడం కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం సఫారీలు 400 పరుగుల స్కోరును టార్గెట్ చేస్తున్నారు. డీ కాక్, క్లాసెన్, మార్క్రమ్ అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో కూడా యాన్సెన్, కేశవ్ మహరాజ్, రబాడ వంటి స్టార్ ప్లేయర్ ఉన్నారు.
కాబట్టి ఈ మ్యాచులో కూడా విజయం సాధించి, సెమీస్ వైపు మరో అడుగు వేయాలని సౌతాఫ్రికా కోరుకుంటోంది. అదే సమయంలో వరల్డ్ కప్‌లలో సౌతాఫ్రికాపై విజయాల హ్యాట్రిక్ సాధించి, సెమీస్ ఆశలు నిలుపుకోవాలని పాక్ భావిస్తోంది. మరి ఏ టీం పైచేయి సాధిస్తుందో తెలియాలంటే వేచి చూడక తప్పదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications