Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: ఏదో అద్భుతం జరిగి.. మేం సెమీస్ చేరతాం: పాక్ వైస్ కెప్టెన్

PAK vs SA: ఈ వరల్డ్ కప్‌లో అత్యంత చెత్త ఫామ్‌లో ఉన్న టీమ్స్‌లో పాకిస్తాన్ ఒకటి. టోర్నీ ఆరంభంలో నెదర్లాండ్స్, శ్రీలంకను ఓడించిన పాకిస్తాన్.. ఆ తర్వాత చేతులెత్తేసింది. వరుసగా భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో ఓటములు చవిచూసింది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమిని పాక్ ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇక అదే సమయంలో టోర్నీని వరుసగా రెండు ఓటములతో ఆరంభించిన ఆస్ట్రేలియా నెమ్మదిగా గాడిన పడుతోంది. తాజాగా నెదర్లాండ్స్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. ఈ టేబుల్‌లో టాప్-4 టీమ్స్ మాత్రమే సెమీస్ చేరుకుంటాయని తెలిసిందే.

 World Cup 2023 PAKvsSA Pakistan vice captain Shadab Khan says a miracle will heppen

వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు ఓటమెరుగని టీమిండియా.. వరుసగా ఐదు విజయాలతో టేబుల్‌ టాపర్‌గా నిలిచింది. ఇక తాము ఆడిన ఐదు మ్యాచుల్లో ఒక్కోటి ఓడిన సౌతాఫ్రికా, న్యూజిల్యాండ్ ఆ తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నాయి. నాలుగో స్థానాన్ని ప్రస్తుతం ఆస్ట్రేలియా ఆక్రమించింది. ప్రస్తుతం వరల్డ్ కప్ జరుగుతున్న విధానం చూస్తే.. సెమీస్ చేరుకునే తొలి మూడు జట్లు దాదాపు కన్ఫర్మ్ అయ్యాయనే చెప్పాలి.

ఇక నాలుగో స్థానం కోసం ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ పోటీ పడుతున్నాయి. వీటిలో పాకిస్తాన్ చాలా వెనుకబడి ఉంది. దీనికి కారణం ఆ టీంలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఫామ్‌లో ఉన్నట్లు కనిపించడం లేదు. దీనిపై పాకిస్తాన్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ తాజాగా స్పందించాడు. తాము అద్భుతాలను బాగా నమ్ముతామని, ఈ వరల్డ్ కప్ సెమీస్ చేరతామని అనుకుంటున్నామని చెప్పాడు.

గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఎవరూ ఊహించని విధంగా నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోవడంతో పాకిస్తాన్.. సెమీస్ చేరుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఈసారి కూడా సెమీస్ చేరుకుంటామని షాదాబ్ ధీమాగా ఉన్నాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది చాలా కష్టంగా కనిపిస్తుంది.

Story first published: Friday, October 27, 2023, 8:16 [IST]
Other articles published on Oct 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+