Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PAK vs SA: పాక్‌కు చావో రేవో.. అద్భుతం జరుగుతుందా?.. గెలిచేదెవరు?

వరల్డ్ కప్‌లో వరుస ఓటములతో దాదాపుగా సెమీస్ రేసు నుంచి తప్పుకున్న పాకిస్తాన్.. కీలకమైన పోరుకు రెడీ అవుతోంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సౌతాఫ్రికాను ఢీకొట్టేందుకు సిద్ధం అవుతోంది. ఈ వరల్డ్ కప్‌లో సఫారీలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆ టీం ఓపెనర్ క్వింటన్ డీ కాక్, ఫినిషర్ హెన్రిక్ క్లాసెన్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నారు.

ప్రస్తుతం పేలవంగా ఉన్న పాకిస్తాన్ బౌలింగ్ ఎటాక్ వీళ్లను ఎదుర్కోవడం చాలా కష్టమనే చెప్పాలి. ఎలాంటి బౌలింగ్ ఎటాక్ అయినా సరే విధ్వంసం సృష్టించేందుకు సఫారీ బ్యాటర్లు రెడీగా ఉన్నారు. అదే సమయంలో ఈ వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ బ్యాటింగ్ విభాగం అంత గొప్పగా రాణించింది లేదు. ముఖ్యంగా ఆ టీం కెప్టెన్ బాబర్ ఆజమ్ జట్టును ముందుండి నడిపించడంలో విఫలం అవుతున్నాడు.

 World Cup 2023 PAKvsSA Do or Die for Pakistan Who will win todays match

ఈ వరల్డ్ కప్ మొత్తంలో అతను కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. ఐదు మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలతో కేవలం 156 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక ఆ టీం ఆధార పడుతున్న మరో బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్. అయితే అతను కూడా ఇటీవలి మ్యాచుల్లో పెద్దగా రాణించలేదు. ఇక పాక్ బౌలింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

వరల్డ్ కప్‌లో ఉన్న జట్లలో అత్యంత ప్రమాదకరమైన బౌలింగ్ ఎటాక్స్‌లో ఒకటి అవుతుందని పాక్ బౌలింగ్ విభాగం గురించి అంతా అనుకున్నారు. కానీ ఈ టీం మరీ పేలవమైన ప్రదర్శన చేస్తోంది. షహీన్ అఫ్రిదీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. మిగతా పేసర్లు కూడా పెద్దగా రాణించడం లేదు. కొద్దో గొప్పో హసన్ అలీ ఆకట్టుకుంటున్నాడంతే.

ఇక స్పిన్ బౌలర్లు కూడా వికెట్లు తీసుకోలేకపోతున్నారు. అదే సమయంలో సౌతాఫ్రికా పేసర్లు మార్కో యాన్సెన్, కగిసో రబాడ, లుంగి ఎన్గిడీ, గెరాల్డ్ కోట్జీ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. కేశవ్ మహరాజ్ తన స్పిన్‌తో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు.

వాళ్లు కనుక ఇదే జోరు కొనసాగిస్తే.. సఫారీల చేతిలో కూడా ఓటమి మూటగట్టుకొని, పాకిస్తాన్ ఈ వరల్డ్ కప్ సెమీస్ రేసు నుంచి తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. షాదాబ్ ఖాన్ అన్నట్లు ఏదో అద్భుతం జరిగితే తప్ప పాక్ టీం సెమీస్ చేరడం అసాధ్యమే.

Story first published: Friday, October 27, 2023, 9:08 [IST]
Other articles published on Oct 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+