Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: షహీన్ రీఎంట్రీ.. తొలి విజయంపై కన్నేసిన పాక్!

ఈ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తమ మొదటి మ్యాచ్ కు రెడీ అయింది. నెదర్లాండ్స్ తో హైదరాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన నెదర్లాండ్స్ కెప్టెన్ ఎడ్వర్డ్స్ తాము ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. తమకు పాక్ తో చాలా ఆడిన అనుభవం ఉందని, అది ఇక్కడ యూజ్ అవుతుందని అన్నాడు.

ఈ మ్యాచులో ఆ అనుభవంతో రాణిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ పిచ్ కు అడ్జస్ట్ అవ్వడమే తమ ముందున్న ముఖ్యమైన సవాల్ అని చెప్పుకొచ్చాడు. పవర్ ప్లే లో స్పిన్నర్లు, పేసర్లను దింలుతాం అని చెప్పాడు. అదే సమయంలో తమను హైదరాబాద్ లో చాలా బాగా చూసుకున్నారని బాబర్ మరోసారి చెప్పాడు.

World Cup 2023 PAKvsNED Shaheen makes comeback as Pak eyes first victory

ఇక్కడి పిచ్ పై ఒక అవగాహన వచ్చిందని అన్నాడు. నెదర్లాండ్స్ ముందు 290-300+ టార్గెట్ ఉంచాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా, ఈ పిచ్ పై జరిగిన మ్యాచులో గిల్ వన్డేల్లో డబుల్ సెంచరీ చేయడం గమనార్హం. మరి ఇంతగా బ్యాటింగ్ కు సహకరించే ఈ పిచ్ పై రెండు టీమ్స్ ఎలా రాణిస్తాయో చూడాలి.

పాకిస్తాన్ ఆడిన రెండు వామప్ మ్యాచులు స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రిదీ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే అతను ఈ మ్యాచ్ ఆడుతున్నట్లు బాబర్ వెల్లడించాడు. అలాగే చాలా గ్యాప్ తర్వాత హాసన్ అలీ కూడా ఈ మ్యాచ్ ఆడుతున్నట్లు ప్రకటించారు. షహీన్, హారిస్, హసన్ పేసర్లుగా పాక్ బరిలో దిగుతోంది.

పాకిస్తాన్ టీం: ఇమామ్ ఉల్ హక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజామ్ (కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్, హాసన్ అలీ, షహీన్ షా అఫ్రిదీ, హారిస్ రవూఫ్.

Story first published: Friday, October 6, 2023, 14:16 [IST]
Other articles published on Oct 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+