Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PAKvsBAN: పాకిస్తాన్‌కు అంత సీన్ లేదు.. జోకులు పేల్చిన మాజీ పేసర్!

ప్రస్తుతం వరల్డ్ కప్‌లో అత్యంత చెత్త ఫామ్‌లో ఉన్న టీమ్స్‌లో పాకిస్తాన్ ఒకటి. వరుసగా నాలుగు పరాజయాలు నమోదు చేసిన ఈ టీం.. సెమీస్ రేసు నుంచి దాదాపుగా తప్పుకున్నట్లే. ఏదో అద్భుతం జరిగితే తప్ప పాక్‌కు టాప్-4లో చోటు దక్కడం అసాధ్యమనే చెప్పాలి. కానీ ఫ్యాన్స్ మాత్రం ఇంకా పాకిస్తాన్ సెమీస్ అవకాశాలపై ఆశగానే ఉన్నారు.

ఈ క్రమంలోనే మంగళవారం నాడు బంగ్లాదేశ్‌ను ఢీకొట్టేందుకు పాకిస్తాన్ రెడీ అవుతోంది. ఈ వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఇలాంటి సమయంలో టీమిండియా మాజీ బౌలర్, కేరళ స్పీడ్ స్టర్ శ్రీశాంత్.. కీలక వ్యాఖ్యలు చేశాడు.

World Cup 2023 PAKvsBAN Sreeshant says Pak is not good enough for finals

ఈ వరల్డ్ కప్‌లో అందరి కన్నా పెద్ద చోకర్స్.. పాకిస్తాన్ జట్టేనని శ్రీశాంత్ తేల్చిచెప్పాడు. ఆ టీం సెమీస్ చేరడం అసాధ్యమన్నాడు. 'ఇప్పుడప్పుడే అలాంటిది జరగదు. పాకిస్తాన్ టీం.. ఫైనల్స్ చేరేంత గొప్ప టీం కాదు. వాళ్లు కూడా సౌతాఫ్రికాలాగే. ఫైనల్స్‌లో తడబడుతూ ఉంటారు' అంటూ ఎద్దేవా చేశాడు.

అదే సమయంలో భారత జట్టు ఫైనల్‌కు వెళ్తుందని శ్రీశాంత్ అభిప్రాయపడ్డాడు. ఆ మ్యాచులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగుతాడని జోస్యం చెప్పాడు. 'ఈసారి జరిగే ఫైనల్ అన్నింటికన్నా బెస్ట్ ఫైనల్ అవుతుందని అనుకుంటున్నా. అలాగే రోహిత్ శర్మ ఆ మ్యాచులో చెలరేగి భారత్‌ను గెలిపిస్తాడని భావిస్తున్నా' అని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు.

ఈ మెగా టోర్నీలో భారత జట్టు తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆరు మ్యాచులు ఆడిన భారత్.. ఒక్క పరాజయం కూడా లేకుండా దూసుకెళ్తోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉన్న భారత్.. లీగ్ దశలో ఇంకా మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. వీటిలో కూడా భారత్ ఆధిపత్యం చెలాయించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Story first published: Tuesday, October 31, 2023, 8:03 [IST]
Other articles published on Oct 31, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+