For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAKvsBAN: మళ్లీ కుంటి సాకులు చెప్పిన పాక్ కోచ్.. ఈసారి మొత్తం టోర్నీపై కామెంట్స్!

వరల్డ్ కప్‌లో పరమ చెత్త ప్రదర్శన చేస్తూ విమర్శలపాలు అవుతున్న పాకిస్తాన్.. చావో రేవో తేల్చుకునేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే నాలుగు మ్యాచుల్లో ఓడిన పాకిస్తాన్.. బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచులో ఓడితే ఇక పూర్తిగా సెమీస్ రేసు నుంచి తప్పుకోవాల్సిందే. ఈ క్రమంలోనే పాక్ టీం కెప్టెన్ బ్రాడ్‌బర్న్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

అతని కోచింగ్‌లో వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ చెత్తగా ఆడుతోంది. భారత్‌తో జరిగిన మ్యాచులో ఓడినప్పుడు కూడా దాన్ని హుందాగా తీసుకోవడంలో బ్రాడ్‌బర్న్ విఫలమయ్యాడు. స్టేడియంలో 'దిల్ దిల్ పాకిస్తాన్' పాట కూడా వేయలేదని, అందుకే ఓడిపోయామని అన్నాడు. ఇక ఆ తర్వాత మరో మూడు మ్యాచుల్లో పాక్ ఓడింది. చివరకు ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో కూడా ఓటమి చవిచూసింది.

World Cup 2023 PAKvsBAN Bradburn gives lame excuses to team dismal performance

ఇప్పుడు బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచులో పాక్ తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఉంది. ఈ క్రమంలో మరోసారి బ్రాడ్‌బర్న్ మరోసారి తమ ఓటములకు కారణాలు చెప్పడం మొదలు పెట్టాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు ముందు పాక్ చెత్త ప్రదర్శనపై సాకులు చెప్పాడు.

'మాక్కూడా ఈ పరిస్థితుల్లో ఉండటం ఏమాత్రం ఇష్టం లేదు. టోర్నీ ఈ స్టేజిలో ఉన్నప్పుడు మా తలరాత మా చేతుల్లోనే ఉండే పొజిషన్‌లో ఉండాలని అనుకున్నాం. కానీ అలా జరగలేదు. అదే మా జట్టును చాలా బాధిస్తుంది' అని బ్రాడ్‌బర్న్ అన్నాడు. ఈ క్రమంలోనే తమ టీం తేలిపోవడానికి కారణం కూడా చెప్పాడు.

'ఈ టోర్నీ జరుగుతున్న పరిస్థితులు మాకు చాలా కొత్త. మా టీంలో ఒక్క ప్లేయర్ కూడా ఇంతకుముందు ఇక్కడ ఆడలేదు. ప్రతి వేదిక మాకు కొత్తదే. ఇప్పుడు మ్యాచ్ జరిగే స్టేడియం కూడా కొత్తే. అయితే మా ప్రత్యర్థిపై బాగా హోంవర్క్ చేశాం. మేం ఆడే ప్రతి చోటా ప్రత్యర్థి గురించి చాలా ప్రిపేర్ అయ్యాం' అని తెలియజేశాడు.

'ఇంత ప్రిపేర్ అయినా కూడా ఈ మ్యాచులు జరిగే ప్రతి వేదికా మాకు కొత్తదే కదా. కానీ ఈ నాలెడ్జ్, క్వాలిటీ, ఆటగాళ్ల స్కిల్స్ విషయాల్లో ఎక్కడా మేం తగ్గలేదు. ఈ టీంకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పాక్ జట్టును పేలవ ప్రదర్శనతో పాటు చాలా కాంట్రవర్సీలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, October 31, 2023, 13:45 [IST]
Other articles published on Oct 31, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+