For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAKvsAFG: పాక్ ఓడిందని.. రషీద్ ఖాన్‌తో కలిసి డ్యాన్స్ చేసిన టీమిండియా లెజెండ్!

Irfan Pathan: వరల్డ్ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర సృష్టించింది. ఇటీవల డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఆఫ్ఘన్ టీం.. ఇప్పుడు పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచులో ఏకంగా నలుగురు స్పిన్నర్లతో బరిలో దిగిన ఆఫ్ఘన్ అన్ని విభాగాల్లోనూ సత్తా చాటింది. దీంతో పాకిస్తాన్‌కు ఈ మెగాటోర్నీలో మరో ఓటమి తప్పలేదు.

ఇప్పటికే భారత్, ఆస్ట్రేలియా చేతుల్లో ఓటములు చవిచూసిన పాకిస్తాన్‌కు ఇది ముచ్చటగా మూడో ఓటమి. ఈ ఓటమితో పాక్ సెమీస్ ఆశలు కూడా క్లిష్టంగా మారాయి. అయితే ఆఫ్ఘనిస్తాన్ మాత్రం ఈ విజయంతో తెగ సంబరాలు చేసుకుంది. ఆఫ్ఘన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ బౌండరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ బౌండరీ బాదిన వెంటనే ఆఫ్ఘన్ డగౌట్‌లో సంబరాలు మొదలైపోయాయి.

World Cup 2023 PAKvsAFG Irfan Pathan and Rashid Khan dance to celebrate Afghan victory

ఆఫ్ఘన్ ప్లేయర్లు అందరూ కేరింతలు కొడుతూ ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ చారిత్రాత్మక విజయంతో ప్లేయర్లతోపాటు సహాయక సిబ్బంది కూడా సంబరాలు చేసుకున్నారు. చెపాక్ స్టేడియంలోని ప్రేక్షకులు కూడా ఆఫ్ఘన్ జట్టు చూపించిన పట్టుదలకు ముగ్ధులయ్యారు. స్టాండింగ్ ఒవేషన్‌తో ఆ జట్టు విజయాన్ని అభినందించారు. అనంతరం ఆఫ్ఘన్ జట్టు మైదానం చుట్టూ ఒక రౌండ్ వేసింది.

ఈ విక్టరీ ల్యాప్ సమయంలో తమకు మద్దతుగా నిలిచిన ప్రేక్షకులకు ఆఫ్ఘన్ జట్టు ధన్యవాదాలు తెలిపింది. అప్పుడే స్టేడియంలో నిలబడి కామెంటరీ చెప్తున్న టీమిండియా మాజీ లెజెండ్ ఇర్ఫాన్ పఠాన్ దగ్గరకు ఆఫ్ఘన్ టీం వెళ్లింది. వీరిని చూడగానే పఠాన్ డ్యాన్స్ చేస్తూ ముందుకొచ్చాడు. ఆఫ్ఘన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా డ్యాన్స్ చేస్తూ పఠాన్‌ను కలిశాడు.

ఇలా వీళ్లిద్దరూ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న ఇర్ఫాన్ పఠాన్.. 'రషీద్ తన మాట నిలబెట్టుకున్నాడు. అందుకే నేను నా మాట నిలబెట్టుకున్నా' అంటూ కామెంట్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా పఠాన్, రషీద్ డ్యాన్స్ అదరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Story first published: Tuesday, October 24, 2023, 10:43 [IST]
Other articles published on Oct 24, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+