Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ODI World Cup 2023: వరల్డ్ కప్‌లో సెక్యూరిటీ చెక్.. పాక్ నుంచి ప్రత్యేక సెక్యూరిటీ బృందం!

వన్డే వరల్డ్ కప్ కోసం తమ జట్టును పంపాలా? వద్దా? అని పాకిస్తాన్ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదట. దీనికోసం ప్రత్యేకంగా ఒక సెక్యూరిటీ బృందాన్ని భారత్‌కు పంపాలని పాక్ ప్రభుత్వం డిసైడ్ అయింది. భారత్‌లో పాకిస్తాన్ మ్యాచులు ఉన్న నగరాల్లో ఈ సెక్యూరిటీ బృందం ముందుగా పర్యటిస్తుందని, ఇక్కడి భద్రతా చర్యలను పరిశీలిస్తుందని సమాచారం.

ఈ బృందం ఇచ్చిన నివేదికను బట్టే పాక్ జట్టును పంపేందుకు ఆ దేశ ప్రభుత్వం పచ్చ జెండా ఊపుతుందని తెలుస్తోంది. భారత్‌కు సెక్యూరిటీ బృందాన్ని ఎప్పుడు పంపాలనే నిర్ణయం పీసీబీ కొత్త చైర్మన్ తీసుకుంటాడు. 'పీసీబీ ప్రతినిధులతో కలిసి ఈ డిలిగేషన్ భారత్‌కు వెళ్తుంది. అక్కడ పాకిస్తాన్ మ్యాచ్‌లు ఉన్న నగరాల్లో వరల్డ్ కప్ కోసం తీసుకున్న భద్రతా చర్యలను పరిశీలిస్తుంది' అని ఇంటర్ ప్రావిన్షియల్ కో-ఆర్డినేషన్‌ (స్పోర్ట్స్)కు చెందిన ఒక అధికారి తెలిపాడు.

Pakistan is not yet ready to send their team for CWC2023

పాకిస్తాన్ మ్యాచ్‌లు ఉన్న చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, అహ్మదాబాద్‌లో ఈ డిలిగేషన్ పర్యటిస్తుందని సదరు అధికారి స్పష్టం చేశాడు. 'భారత్‌లో పర్యటనకు ముందు ఇలా ప్రభుత్వం నుంచి పీసీబీ అనుమతి కోరడం మామూలే. అప్పుడు ఇలా ఒక డిలిగేషన్‌ను పంపడం కూడా చాలా కాలంగా జరుగుతున్నదే' అని ఆ అధికారి చెప్పాడు. ఆయా నగరాల్లో ఉన్న అధికారులతో ఈ డిలిగేషన్ సభ్యులు చర్చలు జరుపుతారట.

'ఈ నగరాల్లోని ప్రభుత్వ అధికారులతో డిలిగేషన్ సభ్యులు మాట్లాడతారు. ఆ తర్వాత ఆటగాళ్లు, అభిమానులు, అఫీషియల్స్, మీడియా.. ఇలా అందరికీ ఎలాంటి భద్రత కల్పిస్తున్నారని పరిశీలించడం జరుగుతుంది. ఒక వేళ ఈ డిలిగేషన్ కనుక ఒక వేదికలో ఆడటం కుదరదంటే.. దాన్ని మార్చాలని నివేదిక ఇస్తుంది. ఈ నివేదికను పీసీబీ తీసుకెళ్లి ఐసీసీ, బీసీసీఐకి అందజేస్తుంది' అని తెలిపాడు.

గతంలో టీ20 వరల్డ్ కప్‌లో భారత్, పాక్ మ్యాచ్‌ను మొహాలీ నుంచి మార్చడానికి కూడా ఇలా డిలిగేషన్ ఇచ్చిన నివేదికే కారణమని ఆ అధికారి వివరించాడు. అలాగే ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు పాక్ ఈ టోర్నీ ఆడుతుందా? లేదా? అనే విషయం చెప్పలేమన్నాడు. మరి ఈ డిలిగేషన్ ఎప్పుడు భారత్ బయలు దేరుతుందో చూడాలి.

Story first published: Saturday, July 1, 2023, 16:53 [IST]
Other articles published on Jul 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+