Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: పాక్ సూపర్ ఫ్యాన్‌కు చేదు అనుభవం.. ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేసిన పోలీసులు!

వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ మ్యాచులు చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్‌కు పోలీసులు షాకిచ్చారు. పాకిస్తాన్ టీంకు ఉన్న అతిపెద్ద అభిమానుల్లో బషీర్ అనే వ్యక్తి ఒకరు. అతన్ని అందరూ ఆప్యాయంగా 'చాచా' అని పిలుస్తారు. అతనికి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ టీం అంతా భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే.

వరల్డ్ కప్ కోసం భారత్ చేరుకున్న పాకిస్తాన్ జట్టు.. హైదరాబాద్‌లో ల్యాండయింది. సాయంత్రం 8 గంటల ప్రాంతంలో పాకిస్తాన్ టీం సభ్యులు విమానాశ్రయంలో నుంచి బయటకు వచ్చారు. ఇలా తన ఫేవరెట్ టీం కంట పడటంతో బషీర్ తన ఆనందం ఆపుకోలేకపోయాడు. వెంట తెచ్చుకున్న పాకిస్తాన్ జెండా ఊపుతూ టీంకు స్వాగతం పలికాడు. అయితే దీన్ని చూసిన ఎయిర్‌పోర్టు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.

World Cup 2023 Pakistan super fan Basheer Chacha arrested at Airport

బషీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పబ్లిక్ సేఫ్టీ కోసమే పోలీసులు ఈ పని చేశారు. దీంతో ఈ సంతోషకర సమయంలో కొంత ఇబ్బంది ఎదురైంది. అయితే ఇక్కడ జరిగిన మిసండర్‌స్టాండింగ్‌ను అధికారులు బషీర్‌కు చెప్పారు. విషయం అర్థం చేసుకున్న బషీర్ కూడా అధికారులకు సహకరించాడు. తను పాకిస్తాన్ టీంకు పెద్ద సపోర్టర్‌ను అని, తమ టీంను చూసేందుకు పాక్ నుంచి వచ్చానని చెప్పాడు.

ఈ ఇష్యూ పెద్దది అవకుండా ఉండటం కోసం తన ట్రావెలింగ్ ధ్రువ పత్రాలను కూడా అధికారులకు చూపించాడు. టికటె్లు, ఐడెంటిటీ కార్డులను కూడా వారికి చూపించాడు. దీంతో అధికారులు అతన్ని కస్టడీ నుంచి విడుదల చేశారు. అప్పుడు మళ్లీ ఫ్యాన్స్‌తో కలిసి తమ టీంకు ఆహ్వానం పలికాడు బషీర్.

హైదరాబాద్‌లోనే పాక్ జట్టు తమ తొలి వార్మప్ మ్యాచ్ ఆడనుంది. న్యూజిల్యాండ్‌తో జరిగే ఈ మ్యాచుకు ముందుగా ప్రేక్షకులను అనుమతించాలని అనుకున్నారు. కానీ వినాయక నిమజ్జనాలు సహా ఆ రోజున పండుగలు ఉండటంతో మ్యాచ్‌కు భద్రత కల్పించడం కష్టమని స్థానిక అధికారులు చెప్పారు. దీంతో ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించడం లేదని, టికెట్ డబ్బులు వాపస్ చేస్తామని బీసీసీఐ తెలిపిన సంగతి తెలిసిందే.

Story first published: Thursday, September 28, 2023, 21:55 [IST]
Other articles published on Sep 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+