Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: ఇలాగైతే పాక్ సెమీస్ చేరడం కష్టమే.. బాబర్ సేన ఇక ఇంటికేనా?

PAKvsAFG: ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమితో పాకిస్తాన్ పరువు పోయింది. ఇప్పటి వరకు ఆఫ్ఘన్ చేతిలో వన్డే మ్యాచ్ ఓడని పాక్.. ఏకంగా వరల్డ్ కప్‌లో ఓడిపోయింది. ఈ ఓటమితో మెగా టోర్నీలో పాక్ సెమీస్ చేరే అవకాశాలు కూడా బాగా దెబ్బతిన్నాయి. ఎందుకంటే.. ప్రస్తుతం ఈ టోర్నీలో మూడు జట్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాయి.

భారత్, న్యూజిల్యాండ్, సౌతాఫ్రికా.. ఈ మూడు టీమ్స్ అత్యద్భుతమైన ఫామ్ కనబరుస్తున్నాయి. కాబట్టి సెమీస్ రేసులో కూడా ఈ మూడు జట్లు ముందంజలో ఉన్నాయి. అంటే నాలుగు సెమీస్ బెర్తుల్లో దాదాపుగా మూడు ఇప్పటికే ఖాయమైపోయాయి అన్నమాట. కచ్చితంగా ఈ మూడు సెమీస్ చేరతాయని చెప్పలేకపోయినా.. ప్రస్తుతం వాటి ఫామ్ చూస్తే వేరే టీమ్స్‌కు ఛాన్స్ దక్కడం కష్టంగానే ఉంది.

World Cup 2023 Pakistan Semifinal chances become tough after PAKvsAFG loss

అంటే చివరిదైన నాలుగో స్థానం కోసం పాక్ పోటీ పడాల్సి ఉంది. దీని కోసం ఆస్ట్రేలియా, డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ పోటీ పడుతున్నాయి. వీటిలో ఇంగ్లండ్ చాలా చెత్త ఫామ్‌లో ఉంది. నాలుగు మ్యాచుల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది.

ఇప్పుడు ఆఫ్ఘన్ చేతిలో ఓటమితో పాకిస్తాన్ కూడా ఐదు మ్యాచుల్లో రెండు విజయాలతో ఐదో స్థానంలో నిలిచింది. అయితే పాక్ నెట్ రన్ రేట్ -0.400గా ఉంది. అదే సమయంలో ఈ విజయంతో ఆఫ్ఘన్ వద్ద కూడా నాలుగు పాయింట్లు చేరాయి. అయితే వారి నెట్ రన్ రేట్ -0.969.. పాక్ కన్నా కొంచెం తక్కువగా ఉండటంతో ఆరో స్థానంలో నిలిచింది.

పాక్ తమ తర్వాతి మ్యాచుల్లో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, న్యూజిల్యాండ్, ఇంగ్లండ్‌తో తలపడుతుంది. వీటిలో బంగ్లాపై మినహా మిగతా మూడు జట్లపై విజయం సాధించడం పాక్‌కు అంత ఈజీ కాదు. ఇక బంగ్లా కూడా ఐసీసీ టోర్నీల్లో అద్భుతంగా ఆడుతుందనే సంగతి తెలిసిందే.

అదే సమయంలో ఆప్ఘనిస్తాన్ తమ తర్వాతి మ్యాచుల్లో శ్రీలంక, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాను ఎదుర్కొంటుంది. ప్రస్తుతం ఆఫ్ఘన్ టీం ఉన్న ఫామ్ చూస్తే శ్రీలంక, నెదర్లాండ్స్‌ను ఈజీగా ఓడించేలా కనిపిస్తోంది. ఇటీవలే ఇంగ్లండ్‌ను కూడా ఓడించిన ఈ టీం.. ఆసీస్, సౌతాఫ్రికాలో ఏ ఒక్క టీంకు షాకిచ్చినా సెమీస్ చేరే నాలుగో స్థానాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Story first published: Tuesday, October 24, 2023, 8:53 [IST]
Other articles published on Oct 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+