భారత్‌లో జరిగే వరల్డ్ కప్ కోసం అన్ని జట్లు వరుసగా ఇక్కడకు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ కూడా భారత్‌కు బయల్దేరింది. దీని కన్నా ముందు మీడియాతో ఆ టీం కెప్టెన్ బాబర్ ఆజమ్ మాట్లాడాడు. ఈ ప్రెస్ మీట్‌లో విలేకరుల ప్రశ్నలకు బాబర్ వెటకారంగా సమాధానలు చెప్పడం వైరల్ అవుతోంది.
ఇటీవలే పాకిస్తాన్ వరల్డ్ కప్ టీంను ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించింది. ఈ జట్టులో యువ పేస్ సంచలనం నసీమ్ షాకు చోటు దక్కలేదు. గాయంతో ఇబ్బంది పడుతున్న అతను వరల్డ్ కప్ మిస్సయ్యాడు. అయితే పాక్ జట్టులో సరైన క్వాలిటీ స్పిన్నర్ లేడని వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్, ఉసామా మిర్‌ను స్పిన్ బౌలింగ్ ఆప్షన్లుగా తీసుకున్నారు.

ఈ క్రమంలో పాకిస్తాన్ దగ్గర సరైన స్పిన్నర్ లేడని, సెలెక్ట్ చేసిన స్పిన్నర్లు అంత గొప్పగా లేరని విలేకరులు ప్రశ్నించారు. ఈ క్వశ్చన్ ఏమాత్రం నచ్చని బాబర్.. సదరు విలకేరిని ఏకిపారేశాడు. 'సెలెక్ట్ చేసిన వాళ్లు బాగలేకపోతే.. ఎవరు మంచి స్పిన్నర్లో మీరే చెప్పండి' అంటూ నిలదీశాడు. ఈ టీంను విలేకరులు తమ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తున్నారని, అందుకే వాళ్లు అంత గొప్పగా లేరని అంటున్నారని బాబర్ చెప్పాడు.
'నా వరకు మా బెస్ట్ ప్లేయర్లే బెస్ట్ స్పిన్నర్లు. మనం వాళ్లను మరీ త్వరగా జడ్జ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇటీవలి కాలంలో వాళ్లు అంత గొప్పగా రాణించలేదనేది వాస్తవమే. కానీ దానర్థం వాళ్లు బెస్ట్ కాదని కాదు. వాళ్లు చాలా మంచి స్పిన్నర్లు. అందుకే పాకిస్తాన్‌కు ఆడుతున్నారు. వరల్డ్ కప్‌లో వాళ్లు రాణిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది' అని బాబర్ తేల్చిచెప్పాడు. అదే సమయంలో నసీం షా లేకపోవడం దురదృష్టకరం అన్నాడు.