Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsPAK: వన్డే వరల్డ్ కప్‌ కూడా హైబ్రీడ్ మోడల్.. పాక్ షాకింగ్ డిమాండ్‌!

పాకిస్తాన్ వేదికగా ఈ ఏడాది జరగాల్సిన ఆసియా కప్‌కు తమ జట్టును పంపడం కుదరదని బీసీసీఐ తేల్చిచెప్పింది. పాక్ ఎంత గొడవ చేసినా బీసీసీఐ మాత్రం వెనక్కు తగ్గలేదు. ఈ క్రమంలోనే ఆసియా కప్‌ను తటస్థ వేదికకు తరలించడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ససేమిరా అన్నది. దీంతో ఈ టోర్నీని హైబ్రీడ్ మోడల్‌లో నిర్వహించేందుకు పాకిస్తాన్ ముందుంచ్చారు.

పాకిస్తాన్‌లో జరగాల్సిన ఈ టోర్నీని ఇలా హైబ్రీడ్ మోడల్‌లో నిర్వహించడం చాలా మంది పాక్ మాజీలకు నచ్చలేదు.. పీసీబీ కొత్త చీఫ్ కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లడిన మోడల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తనకు ఈ హైబ్రీడ్ మోడల్ ఏమాత్రం నచ్చలేదని, తను పీసీబీ చైర్మన్ అయ్యుంటే కచ్చితంగా హైబ్రీడ్ మోడల్‌ను వ్యతిరేకించే వాడినని అన్నాడు.

INDvsPAK

దీనిపై తాజాగా మరో పాక్ సీనియర్ నేత స్పందించాడు. పాకిస్తాన్ క్రీడాశాఖ మంత్రి ఎహసాన్ మజారీ మట్లాడుతూ.. పాక్‌లో జరగాల్సిన ఆసియా కప్‌ను హైబ్రీడ్ మోడల్‌లో నిర్వహిస్తున్నారని, అలాంటప్పుడు వన్డే వరల్డ్ కప్‌ విషయంలో కూడా అలా చేయాల్సిందని మజారీ అన్నాడు. తాము ఆసియా కప్‌ను హైబ్రీడ్ మోడల్‌లో నిర్వహించాల్సి వచ్చిందని, అలాంటప్పుడు వరల్డ్ కప్‌లో పాక్ మ్యాచులైనా తటస్థ వేదికల్లో పెట్టాలని అంటున్నాడు.

INDvsPAK

ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ ఆడుతుందా? లేదా? అనే అంశంపై క్లారిటీ లేదు. పాక్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే తమ జట్టును భారత్‌కు పంపాల్సి ఉంటుందని, అప్పటి వరకు తాము ఏం చెప్పలేమని పీసీబీ (పాక్ క్రికెట్ బోర్డు) ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మజారీ ఇప్పుడు పాక్ మ్యాచులు తటస్థ వేదికలో నిర్వహించాలని మజారీ డిమాండ్ చేస్తున్నాడు. మరి పాక్ ప్రభుత్వం తమ జట్టును భారత్‌కు పంపుతుందో లేదో చూడాలి.

Story first published: Sunday, July 9, 2023, 14:35 [IST]
Other articles published on Jul 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+