Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NZvsPAK: చెత్త రికార్డు మూటగట్టుకున్న పాక్ పేసర్.. దుమ్ము దులిపేస్తున్న ఫ్యాన్స్!

పాకిస్తాన్‌కు చావో రేవో వంటి మ్యాచులో ఆ టీం బౌలర్లు తేలిపోయారు. ఏమాత్రం లైన్ అండ్ లెంగ్త్ లేకుండా బౌలింగ్ చేసి మైదానం నలువైపులా భారీ షాట్లు సమర్పించుకున్నారు. దీంతో తమ వద్ద ప్రపంచ స్థాయి పేసర్లు ఉన్నారని చెప్పుకునే పాక్ ఫ్యాన్స్‌కు నోట మాట రావడం లేదు. ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో పడిపోయారు.

పాక్ ప్రధాన పేసర్లు షహీన్ అఫ్రిదీ, హారిస్ రవూఫ్ ఇద్దరూ ఈ మ్యాచులో చెత్త ప్రదర్శన చేశారు. పరుగులు కట్టడి చేయడం, డెత్ ఓవర్లలో చెలరేగడం రవూఫ్ స్పెషాల్టీ అని పాక్ ఫ్యాన్స్ అంటారు. కానీ అతన్ని కివీస్ బ్యాటర్లు ఒక ఆట ఆడుకున్నారు. అతను వేసిన పది ఓవర్లలో ఏకంగా 85 పరుగులు పిండుకున్నారు.

World Cup 2023 NZvsPAK Haris Rauf gets Worst Record In World Cups

రవూఫ్ బౌలింగ్‌లో కివీస్ బ్యాటర్లు 11 ఫోర్లు, 2 సిక్సర్లు బాదారు. దీంతో అతని పేరిట ఒక చెత్త రికార్డు చేరింది. ఈ రెండు సిక్సర్లతో కలిపి ఈ వరల్డ్ కప్‌‌లో ఇప్పటి వరకు రవూఫ్ 16 సిక్సర్లు బాదించుకున్నాడు. ఒక వరల్డ్ కప్ ఎడిషన్‌లో ఒక బౌలర్ ఇచ్చిన అత్యధిక సిక్సర్లు ఇవే. దీంతో అతన్ని నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం రవూఫ్ వేగాన్ని చూపిస్తూ టీమిండియా వెటరన్ పేసర్ భువీని పాక్ ఫ్యాన్స్ ఎగతాళి చేశారు. భువీ వేసే అత్యంత ఫాస్ట్ డెలివరీ, రవూఫ్ వేసే స్లో డెలివరీ కన్నా చిన్నగా ఉందంటూ గేలి చేశారు. అలాంటప్పుడు టీమిండియా ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఇప్పుడు రవూఫ్ పరువు తీసేస్తున్నారు.

ఇంత దారుణంగా ఎవరూ బౌలింగ్ చేయరని, బాదించుకోవడానికి ఎంత ఫాస్ట్ బౌలింగ్ వేసి ప్రయోజనం ఏంటని అంటున్నారు. రవూఫ్ చరిత్ర సృష్టించాడంటూ నెట్టింట మీమ్స్ పేలుస్తున్నారు. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ బాదిన రెండు సిక్సర్ల తర్వాత రవూఫ్ కెరీర్ గ్రాఫ్ మారిపోయిందని అంటున్నారు.

Story first published: Saturday, November 4, 2023, 15:46 [IST]
Other articles published on Nov 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+