NZvsPAK: కివీస్ బ్యాటర్ల బ్యాట్లు చెక్ చేయాలి.. పాక్‌పై పేలుతున్న జోకులు!
సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో పాక్ బౌలర్లు తేలిపోయారు. కివీస్ బ్యాటర్ల ధాటికి చేతులెత్తేశారు. పాక్ ప్రధాన పేసర్లు షహీన్ అఫ్రిదీ, హారిస్ రవూఫ్ ఇద్దరూ దారుణమైన గణాంకాలు నమోదు చేశారు. ఇదంతా చూసిన ఫ్యాన్స్.. పాక్ టీంను తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ బౌలింగ్ ఎటాక్ ప్రపంచంలోనే బెస్ట్ అని చెప్పారు కదరా అంటూ మీమ్స్ పేలుస్తున్నారు.
అంతేకాదు ఈ మ్యాచులో రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (95) అద్భుతంగా రాణించారు. వాళ్ల బ్యాటింగ్ చూసిన ఫ్యాన్స్.. దాన్ని చూపించి కూడా పాక్‌ను ట్రోల్ చేస్తున్నారు. వాళ్లిద్దరిలో ఎవరో ఒకరికి బీసీసీఐ కొత్త రకం బ్యాట్ ఇచ్చిందని, అందుకే వాళ్లు అంతలా పాక్ బౌలర్లను బాదేశారంటూ జోకులు పేల్చారు. లేకపోతే షహీన్ అఫ్రిదీ బౌలింగ్‌ను ఎవరూ ఆడలేరంటూ ట్రోల్ చేస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం శ్రీలంకపై భారత బౌలర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచులో భారత జట్టు 357 పరుగులు చేసింది. ఆ తర్వాత షమీ, సిరాజ్ చెలరేగడంతో శ్రీలంకను 55 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ క్రమంలో పాక్ మాజీ దిగ్గజం హసన్ రజా సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత బౌలర్లు బౌలింగ్ చేస్తుంటే బంతి మరీ స్వింగ్ అవుతోందని ఆరోపించాడు.
భారత బౌలర్లకు బీసీసీఐ ఏవో ట్యాంపర్ చేసిన బంతులు ఇస్తున్నట్లు కనిపిస్తోందని, దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశాడు. దీంతో అతనిపై తెగ విమర్శలు వచ్చాయి. దీన్నే ఎత్తి చూపుతున్న అభిమానులు.. ఇప్పుడు కివీస్ బ్యాటర్లకు కూడా ట్యాంపర్ చేసిన బ్యాట్లు ఇచ్చారని, వాటిని కూడా పరీక్షించాలని జోకులు పేలుస్తున్నారు.
ఈ మ్యాచులో పాక్ ప్రధాన పేసర్ షహీన్ అఫ్రిదీ తన 10 ఓవర్లలో ఏకంగా 90 పరుగులు సమర్పించుకున్నాడు. వరల్డ్ కప్ మ్యాచులో ఒక పాకిస్తాన్ బౌలర్ వేసిన అత్యంత చెత్త ప్రదర్శన ఇదేనట. ఈ మ్యాచులో షహీన్ ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications