Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NZvsPAK: కేన్ మామ్ అదిరే క్యాచ్.. గాయపడింది నువ్వేనా? అంటూ ఫ్యాన్స్ షాక్!

పాకిస్తాన్‌తో జరుగుతున్న కీలక పోరులో రీఎంట్రీ ఇచ్చిన న్యూజిల్యాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అద్భుతంగా ఆడుతున్నాడు. తొలుత బ్యాటింగ్‌లో (95) వేగంగా ఆడుతూ సెంచరీకి చేరువైన అతను.. శతకానికి ఐదు పరుగుల దూరంలో అవుటయ్యాడు. కానీ ధాటిగా ఆడుతూ పాక్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు.

అతనితోపాటు రచిన్ రవీంద్ర (108) సహా మిగతా బ్యాటర్లు కూడా రాణించడంతో కివీస్ ఏకంగా 401 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక ఛేజింగ్‌లో పాకిస్తాన్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. టిమ్ సౌథీ వేసిన రెండో ఓవర్లోనే పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (4) పెవిలియన్ చేరాడు. అతన్ని అవుట్ చేయడానికి విలియమ్సన్ పట్టిన క్యాచ్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

World Cup 2023 NZvsPAK Fans Shocked to see Kane Williamson splendid catch

సౌథీ వేసిన బంతిని మిడాఫ్ మీదుగా బౌండరీకి తరలించేందుకు షఫీక్ ప్రయత్నించాడు. అయితే అది సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో బంతి బాగా గాల్లోకి లేచింది. కానీ మిడాఫ్‌లో ఉన్న కేన్ విలియమ్సన్‌ను దాటేసింది. దాన్ని వదలడం ఇష్టం లేని కేన్ మామ.. వేగంగా పరిగెత్తుతూ వచ్చి ముందుుక డైవ్ చేశాడు.

తల మీదుగా వస్తున్న బంతి ఎక్కడ పడుతుందో చక్కగా అంచనా వేసి అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. కొన్ని రోజుల క్రితం బంగ్లాదేశ్‌తో మ్యాచులో అతని బొటన వేలికి గాయమైన సంగతి తెలిసిందే. అలాగే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు అతని మోకాలికి కూడా గాయమైంది.

ఈ క్యాచ్ చూసిన ఫ్యాన్స్ మాత్రం అతనికి ఈ గాయాలు అయ్యాయంటే నమ్మలేకపోతున్నారు. ఇన్ని రోజులు గాయంతో జట్టుకు దూరమైన వాడిలా ఉన్నాడా? అంటూ కేన్ విలియమ్సన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేన్ మామ కేవలం బ్యాటుతోనే కాదు.. ఫీల్డింగ్‌తోనూ ఘనంగా రీఎంట్రీ ఇచ్చాడని మరికొందరు అంటున్నారు.

ఏదేమైనా ఈ వరల్డ్ కప్‌లో కివీస్‌కు కేన్ మామ చాలా ముఖ్యమని, అతను లేకపోవడం ఆ జట్టును కొంత ఇబ్బంది పెట్టిందని చాలా మంది చెప్పారు. ఇప్పుడు అతను రీఎంట్రీ ఇవ్వడంతో ఆ జట్టు కూడా అద్భుతంగా ఆడుతోందని కితాబిస్తున్నారు.

Story first published: Saturday, November 4, 2023, 17:59 [IST]
Other articles published on Nov 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+