Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NZvsAFG: కేన్ మామ మళ్లీ అవుట్.. మరో సంచలనానికి ఆఫ్ఘన్ సిద్ధం!

డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన ఉత్సాహంతోనే ఇప్పుడు పటిష్ఠ న్యూజిల్యాండ్‌ను ఢీకొట్టబోతోంది ఆఫ్ఘనిస్తాన్. మరోపక్క కీలక బ్యాటర్, కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టుకు దూరం కావడంతో ఒత్తిడిలో బరిలోకి దిగుతోంది న్యూజిల్యాండ్. ఇలాంటి సమయంలో మరి న్యూజిల్యాండ్ తన విజయాల పరంపర కొనసాగించగలుగుతుందా..? లేక ఇంగ్లండ్‌లానే న్యూజిల్యాండ్‌ కూడా ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్‌ చేతిలో దెబ్బతింటుందా..? అనేదే ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.

ఆప్ఘన్, న్యూజిల్యాండ్ మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా వరల్డ్ కప్ 16వ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. న్యూజిల్యాండ్‌ను సాధ్యమైనంత తక్కువ పరుగులకు ఆలౌట్ చేయడమే తమ ప్లాన్ అని ఆఫ్ఘన్ కెప్టెన్ హష్మతుల్లా చెప్పుకొచ్చాడు. దీనికోసం బౌలింగ్‌లో ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామన్నాడు. అలాగే ఇంగ్లండ్‌పై సక్సెస్ అయిన జట్టుతోనే ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగుతున్నామన్నాడు.

World Cup 2023 NZ going to fight Afghan without Kane Williamson

ఇక కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ మాట్లాడుతూ.. పిచ్ అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌కు అనుకూలించేలా ఉందన్నాడు. జట్టులో విలియమ్సన్ లేకపోవడం కొద్దిగా ఒత్తిడిలో ఉన్నా వరల్డ్ కప్ లాంటి టోర్నీలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నాడు. జట్టులో విలియమ్సన్ స్థానంలో విల్ యంగ్‌ను తీసుకున్నట్లు చెప్పాడు.

ఆఫ్ఘనిస్తాన్:
రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), అజ్మతుల్లా ఉమర్జాయ్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూకీ.

న్యూజిలాండ్:
డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్ (కెప్టెన్, వికెట్ కీపర్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, మార్క్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.

Story first published: Wednesday, October 18, 2023, 14:16 [IST]
Other articles published on Oct 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+