ఈ వరల్డ్ కప్ లో మంచి జోరు మీదున్న టీమ్ సౌతాఫ్రికా. వరుస విజయాలతో దూసుకొస్తున్న సఫారీలు తమ తాజా మ్యాచులో నెదర్లాండ్స్ ను ఎదుర్కొంటున్నారు. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. సరిగ్గా టాస్ టైంలో వర్షం పడింది. దీంతో టాస్ వేయడం ఆలస్యం అయింది.
ఒక గంట ఆలస్యంగా టాస్ వేశారు. ఈ టాస్ గెలిచిన సఫారీ కెప్టెన్ టెంబా బవుమా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ గ్రౌండ్ చిన్నదాని, ఇక్కడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకున్నానని బవుమా చెప్పాడు. అలాగే ఇటీవలి కాలంలో తాము ఎక్కువగా ముందు బ్యాటింగ్ చేస్తున్నామని, అది కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక కారణమే అని తెలిపాడు.

తమ టీమ్ నిలకడగా రాణించడం సంతోషంగా ఉందని చెప్పాడు. అలాగే తమ టీంలో ఒకే ఒక మార్పు చేశామని వెల్లడించాడు. స్టార్ స్పిన్నర్ తబ్రైజ్ షంసీ ఈ మ్యాచ్ ఆడటం లేదని, అతని స్థానంలో గెరాల్డ్ కొట్జీ ఆడుతున్నాడు అని చెప్పాడు. తను టాస్ గెలిచి ఉంటే తాను కూడా ముందు బౌలింగ్ తీసుకునే వాడినని నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ చెప్పాడు.
ఈ టోర్నీలో నెదర్లాండ్ ఇప్పటివరకు ఒక్క విజయం కూడా సాధించలేదు. ఈ మ్యాచులో అయినా బలమైన సౌతాఫ్రికాకు షాక్ ఇవ్వాలని అనుకుంటోంది. అయితే టాస్ పూర్తయిన తర్వాత మళ్లీ వర్షం మొదలు అవడంతో ఈ మ్యాచ్ మరింత ఆలస్యం అవుతోందని.
సౌతాఫ్రికా టీమ్: క్వింటన్ డీ కాక్, టెంబా బవుమా (కెప్టెన్), రాసీ వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రీక్ క్లాసెస్, డేవిడ్ మిల్లర్, మార్కో యాన్సెన్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, గెరాల్డ్ కోట్జీ, లుంగీ ఎంగిడీ