భారత్ వేదికగా జరిగే వరల్డ్ కప్‌కు అంతా రెడీ అయిపోయింది. మరికొన్ని రోజుల్లో ఈ మెగా టోర్నీ మొదలైపోతుంది. ఇలాంటి సమయంలో పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ గెలిచే జట్టు ఏదో చెప్పేశాడు. అసలు ఈ ట్రోఫీ గెలవాలంటే ఏం చేయాలో ఈ మాజీ దిగ్గజం వెల్లడించాడు. ఇది విన్న చాలా మంది ఫ్యాన్స్ కూడా నిజమే కదా అంటున్నారు.
ఈ వరల్డ్ కప్ ఫేవరెట్ల పేర్లు చెప్పాలని ఎవరిని అడిగినా ఆ జాబితాలో భారత్ పేరు ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం టీమిండియా ప్లేయర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. దానికితోడు స్వదేశంలో టోర్నీ జరుగుండటం కూడా భారత్‌కు కలిసొచ్చే అంశం. ఈ క్రమంలోనే అందరూ భారత్ ఈ టోర్నీ ఫేవరెట్లలో కచ్చితంగా ఒకటని అంటున్నారు.

ఇటీవల ఇంగ్లండ్ మాజీ సారధి మైఖేల్ వాన్ కూడా ఇదే వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ గెలవాలంటే ముందుగా భారత్ అడ్డంకిని దాటాలన్నాడు. టీమిండియాను ఓడించిన జట్టే వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడుతుందని జోస్యం చెప్పాడు. ఇప్పుడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ కూడా ఇదే మాట పునరుద్ఘాటించాడు. మైఖేల్ వాన్ మాటలను గుర్తుచేసిన అతను.. టీమిండియా కనుక తప్పులు చేయకపోతే వాళ్లను ఓడించడం అసాధ్యం అన్నాడు.
'ప్రపంచ క్రికెట్‌లో ఇంత గొప్పగా ఎదిగిన టీం భారత్ ఒక్కటే. వరల్డ్ కప్‌లో కనీసం నాలుగు టీమ్స్ బలంగా ఉన్నాయని, వారిపై ఒక కన్నేయాలని అంతా అంటున్నారు. కానీ నన్నడిగితే భారత్‌ను ఓడించిన టీమే వరల్డ్ కప్ గెలుస్తుంది. ఇండియా ఈ టోర్నీలో బెస్ట్ టీం. వాళ్ల బ్యాటింగ్ బలంగా ఉంది. ఇక భారత్‌లో వాళ్ల బౌలింగ్ కూడా బాగుంది' అని బట్ చెప్పాడు.
'టీమిండియా తమకు తాము తప్పులు చేస్తే తప్ప వాళ్లను భారత్‌లో ఓడించడం అసాధ్యం' అని బట్ తేల్చిచెప్పాడు. భారత్‌లో క్రికెట్ వాతావరణం చాలా మెరుగైందని, ఫిట్‌నెస్‌పై అందరూ ఫోకస్ పెడుతున్నారని, తద్వారా వాళ్ల ఫీల్డింగ్ చురగ్గా మారిందని బట్ అన్నాడు. గత కొన్నేళ్లలో టీమిండియా ప్లేయర్ల ఫిట్‌నెస్ స్థాయులు ఒక 15 ఏళ్ల క్రితంతో పోలిస్తే అద్భుతంగా మెరుగయ్యాయి అని తెలిపాడు.
అలాగే క్రికెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కామెంటేటర్లు, ఎక్స్‌పర్ట్‌లు, చివరకు ఆటగాళ్ల కిట్‌లు కూడా మెరుగైనట్లు బట్ పేర్కొన్నాడు. క్రికెట్‌కు సంబంధించిన అన్నీ భారత్‌లో టాప్ నాచ్‌గా ఉన్నాయన్నాడు. అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్ టీంగా వరల్డ్ కప్‌లో అడుగు పెట్టే భారత్.. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో తమ ప్రయాణం మొదలు పెడుతుంది.