Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ENGvsBAN: ఆఖరి క్షణంలో తప్పుకున్న రూట్.. బొక్కబోర్లా పడ్డ బంగ్లా పేసర్.. త్రుటిలో తప్పిన డేంజర్!

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో అనుకోని సంఘటన జరిగింది. ఇంగ్లండ్ బ్యాటర్ జోరూట్ ఒక్కసారిగా వికెట్లు ముందు నుంచి తప్పుకోవడంతో బంగ్లా పేసర్ ముందుకు పడి గాయపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మంగళవారం ధర్మశాలలో ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకోవడంతో ఇంగ్లండ్ బ్యాంటింగ్‌కు దిగింది. ఈ క్రమంలోనే ఇన్నింగ్స్ 23వ ఓవర్‌ వేయాల్సిందిగా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌కు బంతినందించాడు కెప్టెన్ షకిబ్ అల్ హసన్.

World cup 2023 Mustafizur Rahman stumbles because of Joe Root

తొలి బంతి వేసేందుకు వేగంగా పరిగెత్తుకొచ్చిన రెహ్మాన్ సరిగ్గా బంతి డెలివరీ చేసే సమయంలో బ్యాటర్ జో రూట్ క్రీజ్ నుంచి తప్పుకున్నాడు. దీంతో కాన్‌సన్‌ట్రేషన్ కోల్పోయిన ముస్తాఫిజుర్.. బంతిని డెలివరీ చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తూ ముందుకు తూలి కింద పడిపోయాడు.

దీంతో ముస్తాఫిజుర్ కుడికాలికి గాయమైంది. వెంటనే మెడికల్ టీం వచ్చి చెక్ చేసి పెద్ద గాయమేమీ కాలేదని తేల్చడంతో బంగ్లా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కొద్ది సేపటికి కోలుకున్న ముస్తాఫిజుర్ ఓవర్ పూర్తి చేశాడు కూడా.

ఇదిలా ఉంటే మ్యాచ్ మొదటి నుంచే బంగ్లాదేశ్‌పై ఇంగ్లండ్‌‌దే పైచేయిగా ఉంది. మొదట బంగ్లా బౌలర్లపై ఇంగ్లీష్ బ్యాటర్లు విరుచుకుపడ్డారు. ఓపెనర్ జానీ బెయిర్ స్టో 59 బంతుల్లో 8 ఫోర్లతో 52 రన్స్‌‌ చేసి చక్కటి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కానీ మరో ఎండ్‌లో డేవిడ్ మలాన్ 107 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్స్‌లతో ఏకంగా 140 పరుగులతో బంగ్లా బౌలర్లను ఉతికారేశాడు. అతడికి తోడు జో రూట్ కూడా 68 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 82 పరుగులు చేసి బంగ్లా బౌలర్లను ఆడుకున్నాడు.

ఇక ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టానికి 364 పరుగుల భారీ స్కోర్ చేయగా.. బంగ్లాదేశ్ మొదటి నుంచే తడబడింది. పేసర్ రీస్ టాప్లే దెబ్బకు టాప్ ఆర్డర్ మొత్తం కుప్ప కూలింది.

Story first published: Tuesday, October 10, 2023, 18:08 [IST]
Other articles published on Oct 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+