Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUSvsSL: శ్రీలంక బ్యాటర్‌కు స్టార్క్ సీరియస్ వార్నింగ్.. అవుట్ చేసుంటే శ్రీలంక ఏమయ్యేదో..!

శ్రీలంక బ్యాటర్‌ కుశాల్ పెరీరాకు ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. బంతి వేయక ముందే పెరీరా క్రీజ్ వదిలి ముందుకు రావడంతో స్టార్క్ వెంటనే అతడికి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వరల్డ్ కప్‌ టోర్నీలో వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లు లక్నో వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు ఓపెనర్లు పాథుం నిస్సాంక (61), కుశాల్ పెరీరా (78)లు సూపర్ ఓపెనింగ్ ఇచ్చారు. కానీ నిజానికి పెరీరాను తొలి ఓవర్లోనే అవుట్ చేసే అవకాశం వచ్చినా స్టార్క్ వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు.

World Cup 2023 Mitchell Starc gives a stern warning to Sri Lanka batter

ఇన్నింగ్స్ తొలి ఓవర్ మిచెల్ స్టార్క్ వేశాడు. నాలుగో బంతి వేస్తుండగా.. బంతి డెలివరీ చేయకముందే నాన్‌స్ట్రైకర్ ఎండ్‌‌లో ఉన్న కుశాల్ పెరీరా క్రీజ్ వదిలి బయటకు వచ్చేశాడు. ఇది గమనించిన స్టార్క్ బాల్ వేయకుండా ఆగిపోయాడు. కానీ మన్కడింగ్ చేయకుండా కుశాల్‌కు సీరియస్ వార్నింగ్‌ ఇవ్వడమే కాకుండా అంపైర్‌కు కూడా కంప్లైంట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియో చూసిన నెటిజన్స్.. 'నిస్సాంక, కుశాల్ పెరీరా హాఫ్ సెంచరీలు బాదడం వల్లే శ్రీలంక ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. ఒకవేళ కుశాల్‌ను స్టార్క్ అవుట్ చేసి ఉంటే శ్రీలంక పరిస్థితి ఏమై ఉండేదో.. ' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఇన్నింగ్స్ 5వ ఓవర్ ఆఖరి బంతి వేస్తున్న సమయంలో కూడా కుశాల్ ముందుకు రావడంతో స్టార్క్ బంతి డెలివరీ చేయకుండా మరోసారి వార్నింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే రీప్లేలో కుశాల్ క్రీజ్‌లోనే ఉన్నాడని తేలింది.

ఇదిలా ఉంటే మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. ఓపెనర్ల ధాటికి 300 పైగా స్కోర్ చేస్తుందనుకున్నారంతా. కానీ వాళ్లిద్దరి తర్వాత చరిత్ అసలంక (25) తప్ప మరెవ్వరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ఫలితంగా శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకే ఆలౌటైంది.

Story first published: Monday, October 16, 2023, 19:39 [IST]
Other articles published on Oct 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+