Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: పాక్ ఒక వేస్ట్ టీమ్.. కీలక ప్లేయర్లు లేని టీమ్స్ పై గెలిచి ర్యాంక్ కొట్టేసింది!

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ ఆ జట్టుపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. బలహీనమైన జట్లను ఓడించి పాకిస్తాన్ జట్టు వన్డేల్లో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుందంటూ విమర్శించాడు. క్రీడలపై తాజాగా జరిగిన ఓ చర్చలో పాల్గొన్న మిస్బా ఈ కామెంట్స్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.ఈ ఏడాది మేలో వన్డేల్లో పాకిస్తాన్ నెంబర్ స్థానాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే వన్డేల్లో పాకిస్తాన్ నెంబర్ వన్ ర్యాంకు గురించి మిస్బా మాట్లాడుతూ.. పాకిస్తాన్ జట్టు పూర్తి బలంలేని ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌ల జట్లపై గెలిచి నెంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకుందన్నాడు.

'ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ జట్లు పాకిస్తాన్ వచ్చి వన్డే సిరీస్ ఆడాయి. నిజానికి ఆ రెండూ ప్రపంచంలోనే మేటి జట్లు. అయితే ఆ జట్ల కీలక ప్లేయర్లంతా ఐసీఎల్‌లో బిజీగా ఉన్న సందర్భంలో ఆ దేశాల సీ, డీ జట్లు పాకిస్తాన్ వచ్చాయి. ఆ మ్యాచులు గెలవడంతో పాకిస్తాన్ పాయింట్లు పెరిగాయి' అని మిస్బా అన్నాడు.ఆ తర్వాత వెస్టిండీస్ వంటి ఇంకొన్ని బలహీనమైన జట్లతో ఆడి వాటిపై కూడా సునాయాసంగా గెలిచాం. దాంతో పాక్ జట్టు వన్డేల్లో నెంబర్ వన్ అయ్యి కూర్చుంది. మనం ఈ నిజాలను గుర్తించాలి. రియలిస్టిక్‌గా ఆలోచించాలి. మన కీలక ప్లేయర్లందరూ ఉన్న జట్టు కీలక ప్లేయర్లే లేని జట్లతో ఆడి ర్యాంకులు పెంచుకోవడం పెద్ద విషయం కాదు' అని విమర్శించాడు.

World Cup 2023 Misbah-ul-haq slams Pak after their weak performance

'అయితే ఆ జట్లతో మ్యాచ్‌లలో కూడా కొన్ని మ్యాచ్‌లు పాకిస్తాన్ ఓడిపోయిన విషయాన్ని మర్చిపోకూడదు. దీన్ని బట్టి పాక్ జట్టు ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకుని ర్యాంకులు చూసి మురిసిపోవడం మానుకోవాలి' అంటూ పాక్ జట్టుపై మండిపడ్డాడు. ఇదే విషయంపై పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కూడా మిస్బా కామెంట్స్‌ని సమర్థించాడు. నెంబర్ వన్ ర్యాంక్ సాధించడం గొప్ప కాదని, దాన్ని ఎంత కాలం నిలబెట్టుకున్నామన్నదే గొప్ప విషయమని అన్నాడు. ఏ జట్టైనా కనీసం 6 నెలల పాటు నెంబర్ స్థానాన్ని నిలబెట్టుకున్నప్పుడు మాత్రమే ఆ జట్టును బలమైన జట్టుగా పరిగణించాలని అభిప్రాయపడ్డాడు.

ఇదిలా ఉంటే 2022లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టుపై 2-1 తేడాతో పాకిస్తాన్ గెలిచింది. ఇక ఈ ఏడాది న్యూజిల్యాండ్‌తో జరిగిన 5 వన్డేల సిరీస్‌లో కూడా 4-1 తేడాతో విజయాన్ని దక్కించుకుంది. న్యూజిల్యాండ్‌తో సిరీస్‌లో జరిగిన నాలుగో వన్డేలో గెలుపొందిన తర్వాత పాక్‌ జట్టు వన్డేల్లో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. అయితే ఆ తర్వాత ఆసియా కప్‌తో పాటు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లలో అద్భుత ప్రదర్శన చేసిన భారత్.. పాకిస్తాన్‌ను మళ్ళీ వెనక్కి నెట్టి నెంబర్ వన్ ర్యాంక్ పట్టేసింది.

ఇదే సమయంలో వరల్డ్ కప్ వామప్ మ్యాచుల్లో కూడా పాక్ చిత్తుగా ఓడింది.ఇక తాజాగా జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడిన పాకిస్తాన్ 81 రన్స్ తేడాతో విజయం దక్కించుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49 ఓవర్లలో 286 పరుగులు చేసి ఆలౌట్ కాగా.. ఆ తర్వాత పాక్ బౌలర్ల ధాటికి నెదర్లాండ్స్ జట్టు 41 ఓవర్లలో 205 పరుగులకే కుప్పకూలింది. దీంతో ప్రపంచకప్‌లో పాకిస్తాన్ శుభారంభం చేసింది.

Story first published: Saturday, October 7, 2023, 17:31 [IST]
Other articles published on Oct 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+