Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World cup 2023: కోహ్లీ సరే.. అసలు డేంజర్ మాత్రం అతనే: మైఖెల్ క్లార్క్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ ఆకాశానికెత్తేశాడు. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ప్రమాదకరమైన బ్యాటరే కానీ, అతడికంటే ఈ వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మే డేంజరస్ బ్యాట్స్‌మన్ అని అన్నాడు.

బ్యాక్ స్టేజ్ విత్ బోరియా షోలో పాల్గొన్న మైఖెల్ క్లార్క్ రోహిత్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. దాదాపు 10 ఏళ్లుగా భారత్‌ ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదని, ఇలాంటి టైంలో జరుగుతున్న వరల్డ్ కప్ కావడంతో రోహిత్‌పై కచ్చితంగా చాలా ఒత్తిడి ఉంటుందని క్లార్క్ అన్నాడు. అయితే అటు కెప్టెన్‌గా, ఇటు అద్భుతమైన బ్యాట్స్‌మన్‌గా రోహిత్ కచ్చితంగా రాణిస్తాడని చెప్పుకొచ్చాడు.

World cup 2023 Michael Clarke says Not Kohli but Rohit is most dangerous

'టీమిండియాలో ప్రతి ఒక్క ఆటగాడూ వన్డే క్రికెట్లో ఓపెనింగ్ చేయడానికి ఇష్టపడతాడు. అయితే రోహిత్ ఓ గొప్ప ఓపెనింగ్ బ్యాటర్. అతడు తనదైన రోజున అద్భుతంగా ఆడగలడు. రోహిత్‌లా భారీ బౌండరీలు బాదుతూ పవర్ గేమ్ ఆగడల ఆటగాళ్లు టీమిండియాలో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నార'ని క్లార్క్ చెప్పుకొచ్చాడు.

ఇక రోహిత్‌ను విరాట్‌తో పోల్చుతూ ఈ వరల్డ్‌కప్ టోర్నీలో విరాట్ కచ్చితంగా ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్ అని, అందులో సందేహం లేదని అన్న క్లార్క్.. ఈ టోర్నీలో కోహ్లీ డకౌట్ అయితే చూడాలని ఉందని జోక్ చేశాడు. అయితే కోహ్లీ గొప్ప బ్యాటరే కానీ ఈ వరల్డ్ కప్‌ టోర్నీలో మాత్రం రోహిత్ శర్మే డేంజరస్ బ్యాట్స్‌మని క్లార్క్ కితాబిచ్చాడు. రోహిత్ శర్మ సునాయాసంగా సెంచరీలు, డబుల్ సెంచరీ బాదగలడని, అందుకు అతడి పవర్ హిట్టింగే కారణమన్నాడు.

ఇదిలా ఉంటే రోహిత్ ఇప్పటివరకు 251 వన్డేలు ఆడిన రోహిత్.. 48.85 యావరేజ్‌తో, 90.52 స్ట్రైక్ రేట్‌తో 10,112 రన్స్ బాదాడు. అందులో 30 సెంచరీలు, 52 అర్థ సెంచరీలు ఉన్నాయి. అంతేకాకుండా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వరల్డ్ కప్ మ్యాచ్‌లో రోహిత్ 22 పరుగులు చేస్తే.. వరల్డ్ కప్‌ టోర్నీలో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ రికార్డ్ సృష్టిస్తాడు.

Story first published: Sunday, October 8, 2023, 17:50 [IST]
Other articles published on Oct 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+