Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli: కోహ్లీ స్వార్ధంతోనే ఆడతాడా?.. కీలకమైన కామెంట్స్ చేసిన మాజీ లెజెండ్!

World Cup 2023: వరల్డ్ కప్‌లో ఓటమే లేకుండా సెమీస్ చేరుకుంది టీమిండియా. ఈ ప్రయాణంలో పలువురు ప్లేయర్లు కీలక పాత్ర పోషించారు. వీరిలో టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ కూడా ఒకడు. ప్రస్తుతం వరల్డ్ కప్ టాప్ స్కోరర్‌గా ఉన్న అతను అద్భుతమైన ఫామ్ చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలతో చెలరేగాడు.

ఈ క్రమంలోనే ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచులో కోహ్లీ చరిత్ర సృష్టించాడు. తన జన్మదినం నాడు జరిగిన ఈ మ్యాచులో అద్భుతమైన శతకంతో చెలరేగాడు. బ్యాటింగ్ చేయడం అసాధ్యంగా కనిపిస్తున్న పిచ్‌పై అందరి కన్నా ఎక్కువ పట్టుదల చూపించాడు. అయితే ఇవన్నీ పట్టని కొందరు, కోహ్లీ చాలా స్వార్ధంగా బ్యాటింగ్ చేస్తున్నాడని అంటున్నారు.

World Cup 2023 Legend talks about Virat Kohli selfish knocks

సఫారీలపై శతకంతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా సచిన్ రికార్డును కోహ్లీ సమానం చేశాడు. ప్రస్తుతం వీళ్లిద్దరూ కూడా 49 వన్డే శతకాలతో అరుదైన ఘనత సాధించారు. ఈ క్రమంలో వీళ్లిద్దరి క్రికెట్ నుంచి టీమిండియా లెజెండ్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఎక్కడా కూడా రికార్డులపై ఆడినట్లే అన్నాడు.

'విరాట్ ఏమీ తన రికార్డుల కోసం ఆడుతున్నాడని నేను అనుకోవడం లేదు. కొన్ని రోజుల క్రితం తనను నేను కలిశా. ఒక మ్యాచ్‌లో సెంచరీ మిస్ చేసుకున్నావని అన్నా. దానికి కోహ్లీ.. ఏం పర్లేదు ఇంకా చాలా మ్యాచులు ఉనన్నాయి. సెంచరీలు వచ్చేటప్పుడు అవే వస్తాయి అన్నాడు. ఈ మాటలు తన మానసిక స్థాయి' అని వివరించాడు.

కోహ్లీకి సెంచరీలపై కన్నా కూడా మంచి క్రికెట్ ఆడటం, మ్యాచులు గెలవడం మీదనే ఎక్కువ ఫోకస్ ఉందని భజ్జీ తేల్చేశాడు. ఇక ఈ వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణిస్తున్న కోహ్లీ.. కివీస్‌తో సిరీస్‌లో ఎంతలా రాణిస్తాడో చూడాలి.

Story first published: Tuesday, November 14, 2023, 8:47 [IST]
Other articles published on Nov 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+