Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: భారత్‌తో ఆడాలంటే పాకిస్తాన్ వణుకుతోంది.. మాజీ లెజెండ్ షాకింగ్ కామెంట్స్!

వరల్డ్ కప్ ముందు సన్నాహకంగా జరిగిన వార్మప్ మ్యాచులో పాకిస్తాన్ చిత్తుగా ఓడింది. న్యూజిల్యాండ్ ముందు భారీ లక్ష్యం ఉంచినా కూడా దాన్ని కాపాడుకోవడంలో పాక్ విఫలమైంది. దీంతో కివీస్ జట్టు 346 పరుగుల టార్గెట్‌ను మరో ఆరు ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. పాకిస్తాన్ బ్యాటింగ్ రాణించినా బౌలర్లు దారుణంగా తేలిపోయారు. ఇది చూసిన చాలా మంది పాక్ టీంను తిట్టిపోస్తున్నారు.

అంతకుముందు భారత్‌తో జరిగిన ఆసియా కప్ మ్యాచులో కూడా పాకిస్తాన్ ఇలాగే చిత్తుగా ఓడింది. భారత్ చేసిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన పాక్.. ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత శ్రీలంక చేతిలో కూడా ఓడిన పాక్.. ఆసియా కప్ నుంచి నిష్క్రమించింది. ఈ సమయంలో పాక్ డ్రెస్సింగ్ రూంలో పరిస్థితులు బాగలేవని, ఆటగాళ్ల మధ్య గొడవలు ఉన్నాయని వార్తలు వచ్చాయి.

World Cup 2023 Legend says Pakistan afraid of playing against Team India

దీనిపై ఆ తర్వాత మాట్లాడిన పాక్ సారధి బాబర్ ఆజమ్ కూడా జట్టులో కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయని, అయితే గొడవలేం జరగలేదని చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం పాక్ జట్టులో ఐకమత్యం లోపించిందని పాక్ లెజెండ్ మొయీన్ ఖాన్ అంటున్నాడు. 'ప్లేయర్లు ఎవరికి వారే అన్నట్లు ఉన్నారు. ఇది నేను వంద శాతం చూస్తున్నా. బాబర్‌కు సలహా ఇవ్వడానికి కూడా వాళ్లు ఆలోచిస్తున్నారు' అని మొయీన్ ఖాన్ చెప్పాడు.

'రిజ్వాన్, షాదాబ్, షహీన్ ఎవరైనా సరే.. బాబర్‌కు ఏదైనా సలహా ఇవ్వాలన్నా ఆలోచిస్తున్నారు. టీం అంత ఐకమత్యంగా లేదని చాలా క్లియర్‌గా కనిపిస్తోంది. ఈ టీంలో ఎలాంటి డిస్కషన్స్ జరగడం లేదు. ఒకవేళ ఏమైనా మాట్లాడుకొని బాబర్‌కు సలహాలు ఇచ్చినా.. వాటిని అతను ఫాలో అవుతున్నా అవి పనిచేయడం లేదు' అని మొయీన్ ఖాన్ అన్నాడు.

అలాగే భారత్‌తో మ్యాచ్ ఆడాలంటే చాలా మంది పాకిస్తాన్ ప్లేయర్లు భయపడుతున్నట్లు కనిపిస్తోందంటూ షాకింగ్ వార్తలు చేశాడీ మాజీ లెజెండ్. 'ఇంకో విషయం ఏంటంటే.. భారత్‌తో మ్యాచ్ అప్పుడు పాక్ ప్లేయర్లు భయపడినట్లు కనిపించారు. వాళ్ల సలహాలు పనిచేయవేమో? అని వాళ్లు భయపడుతున్నట్లు కనిపించింది. కానీ ఒక క్రికెటర్‌గా జట్టు కోసం వందశాతం కష్టపడాలి. ఇలా భయపడకూడదు' అని చెప్పాడు.

'మనం ఇచ్చే సలహాలు పని చేయకపోవచ్చు. కానీ మనం గెలవాలని అనుకుంటున్నామా? లేదా అనేది మన బాడీ లాంగ్వేజ్‌లో తెలిసి పోతుంది. అదే పాక్ టీంలో కనిపించడం లేదు. టీం డ్రెస్సింగ్ రూంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయనేది చాలా స్పష్టంగా అర్థం అవుతోంది. అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా మెరుగ్గా రాణించేందుకు వీటన్నింటినీ అధిగమించాల్సిన అవసరం ఉంటుంది' అని చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, October 2, 2023, 9:43 [IST]
Other articles published on Oct 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+