Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: టీమిండియాకు డేంజర్ బెల్స్.. ఆ పాక్ పేసర్‌ను ఎదుర్కోవడం అసాధ్యం!

వరల్డ్ కప్‌‌ కోసం అన్ని టీమ్స్ గట్టిగా రెడీ అవుతున్నాయి. ప్రతి బ్యాటర్, బౌలర్ సత్తా చాటి తమ టీంను గెలిపించుకోవాలని అనుకోవడం సహజమే. ఈ క్రమంలో ఈ టోర్నీ మొత్తంలో అదరగొట్టే బౌలర్ మాత్రం పాక్ పేసర్ షహీన్ అఫ్రిదీ అని విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ అభిప్రాయపడ్డాడు. మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు తీసే సత్తా ఉన్న బౌలర్ అఫ్రిదీనే అని స్పష్టం చేశాడు. ఇది ఇన్‌డైరెక్ట్‌గా టీమిండియాకు వార్నింగ్ అనే చెప్పాలి.

గతేడాది గాయం కారణంగా ఆసియా కప్‌లో ఆడని షహీన్.. టీ20 వరల్డ్ కప్‌లో కూడా తన బెస్ట్‌కు చేరుకోలేదు. అయితే ప్రస్తుతం అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇదే విషయాన్ని వివ్ రిచర్డ్స్ గుర్తుచేశాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో తను షహీన్‌ను దగ్గరగా చూశానని, అఫ్రిదీ చాలా పట్టుదల ఉన్న ప్లేయర్ అని మెచ్చుకున్నాడు. ఓవరాల్‌గా చూసుకున్నా.. ప్రస్తుతం పాక్‌ బెస్ట్ బౌలర్ అఫ్రిదీనే.

World Cup 2023 Legend says nobody can stop this pak pacer

ఈ 23 ఏళ్ల పేసర్ తన కెరీర్‌లో 27 టెస్టుల్లో 105 వికెట్లు, 39 వన్డేల్లో 76 వికెట్లు, 52 టీ20ల్లో 64 వికెట్లు తీసుకున్నాడు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీసులో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అంతకుముందు కౌంటీల్లో కూడా బంతితో చెలరేగాడు. ఈ క్రమంలో 2023 వరల్డ్ కప్‌లో ప్రమాదకర బౌలర్ ఎవరని వివ్ రిచర్డ్స్‌ను అడగ్గా.. కచ్చితంగా షహీన్ అఫ్రిదీనే అని రిచర్డ్స్ చెప్పాడు. ఈ వీడియోను ఐసీసీ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

'వరల్డ్ కప్‌లో టాప్ వికెట్ టేకర్‌గా షహీన్ అఫ్రిదీ నిలుస్తాడు. పాకిస్తాన్‌లో నేను అతన్ని చూశా. పీఎస్‌లో కొంత కాలం ఉన్నా. ఆ సమయంలో అఫ్రిదీ ఎంత గొప్పగా ఎదిగాడో ప్రత్యక్షంగా చూశా. తను చాలా పట్టుదల ఉన్న ప్లేయర్. అతనే టాప్ వికెట్ టేకర్ అవుతాడు' అని వివ్ రిచర్డ్స్ ధీమా వ్యక్తం చేశాడు. ఇది విన్న ఫ్యాన్స్ అంతా ఇది టీమిండియాకు వార్నింగ్ అని ఫీలవుతున్నారు.

Story first published: Tuesday, August 29, 2023, 12:58 [IST]
Other articles published on Aug 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+