ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో భారత్ పట్టు బిగిస్తోంది. మొదట బుమ్రా బౌలింగ్‌లో అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌తో మిచెల్ మార్ష్‌ను కోహ్లీ అవుట్ చేయగా.. ఇప్పుడు డేంజరస్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్‌ను అదరగొట్టే రిటర్న్ క్యాచ్‌తో కుల్దీప్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్లో వికెట్‌పై భారత స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఆస్ట్రేలియా బ్యాటర్లు కొద్దిగా తడబడుతున్నారు. ఈ క్రమంలోనే ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ ఆసీస్ బెస్ట్ ఓపెనర్ వార్నర్‌ను అవుట్ చేశాడు. కుల్దీప్ వేసిన ఫుల్ లెంగ్త్ బంతిని వార్నర్ నేరుగా కొట్టబోయాడు. కానీ బంతిని వార్నర్ అనుకున్నంత బలంగా కొట్టలేకపోవడంతో బంతి తక్కువ ఎత్తులో కుల్దీప్ వైపు దూసుకెళ్లింది. ఇది గమనించిన కుల్దీప్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బంతిని అమాంతం ఒడిసిపట్టుకున్నాడు. కుల్దీప్ అందుకున్న ఈ క్యాచ్‌కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కుల్దీప్ అందుకున్న ఈ బ్లైండర్ క్యాచ్‌తో 69 పరుగుల స్మిత్, వార్నర్ పార్ట్‌నర్ షిప్‌కు తెరపడింది. ఇక అప్పటివరకు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న డేవిడ్ వార్నర్ 52 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లున్నాయి. వార్నర్ అవుటయ్యే సమాయానికి ఆసీస్ 16.3 ఓవర్లలో 74 రన్స్ చేసింది.
ఇదిలా ఉంటే కుల్దీప్ యాదవ్ తన బౌలింగ్‌లో చేసుకున్న మార్పుల గురించి కూడా ఇప్పుడు చాలా చర్చ జరుగుతోంది. కెరీర్ మొదట్లో మంచి స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్న కుల్దీప్ ఆ తర్వాత ఫాం కోల్పోయి ఇబ్బందులు పడ్డాడు. జట్టులోనూ స్థానం కోల్పోయి తిరిగి జట్టులోకొచ్చే అవకాశాలు కూడా పోగొట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత తన బౌలింగ్‌లో మార్పులు చేసుకుంటూ అద్భుతంగా తిరిగొచ్చాడు. ఇటీవల జరిగిన ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై 5 వికెట్లు, బంగ్లాదేశ్‌లపై 4 వికెట్లు తీసి అదరగొట్టాడు. ఇక ఇప్పుడు వరల్డ్ కప్ ఆడే జట్టులో స్థానం సంపాదించుకోవడమే కాకుండా తన స్పిన్ వేరియేషన్స్‌తో ప్రత్యర్థులను భయపెడుతున్నాడు.