సుమారు రెండేళ్ల క్రితం టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ పగ్గాలు అందుకున్నాడు. ఈ సమయంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన హిట్‌మ్యాన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ఫ్యాన్స్ మనసు ముక్కలైన రెండు కీలక సందర్భాలు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్. ఈ రెండు మ్యాచుల్లో టాపార్డర్ విఫలం అవడంతో భారత బ్యాటింగ్ లైనప్ అంతా కుప్పకూలింది.
మూడు వికెట్లు పడిన తర్వాత మళ్లీ కోలుకోలేక ఓటములు చవిచూసింది. ఇలాంటి ప్రదర్శనల వల్లనే భారత జట్టు గత పదేళ్లలో టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా నెగ్గలేకపోయింది. ఈ క్రమంలోనే 2021 డిసెంబరులో రోహిత్ శర్మ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఇదే సమస్య గురించి మాట్లాడిన అతను.. తన కెప్టెన్సీలో టీంను ఎలా రెడీ చేస్తున్నారనే ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు.

'జట్టు పది పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా సరే.. మిడిలార్డర్ ధైర్యంగా ముందుకు సాగేలా ఉండాలని నా నమ్మకం' అని రోహిత్ అన్నాడు. కానీ 2020 టీ20 వరల్డ్ కప్‌లో కూడా అలా జరగలేదు. పాకిస్తాన్‌తో మ్యాచులో రోహిత్, రాహుల్ అవుటైన తర్వాత కోహ్లీ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగతా బ్యాటర్లు అందరూ తేలిపోవడంతో మ్యాచులో అనుకున్నంత స్కోరు చేయలేకపోయింది టీమిండియా.
అయితే ఆస్ట్రేలియాతో జరిగిన 2023 వరల్డ్ కప్ ఆరంభ మ్యాచులో ఇదే పరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కొంది. కేవలం 2 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో టీమిండియా ఓటమి తప్పదని అంతా అనుకున్నారు. కానీ మరోసారి కోహ్లీ (85) జట్టును ఆదుకోగా.. ఈసారి అతనికి కేఎల్ రాహుల్ (97 నాటౌట్) నుంచి సహకారం అందింది. వీళ్లిద్దరూ కలిసి జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో ఆనాడు రోహిత్ ఆశ నేటికి ఫలించిందని ఫ్యాన్స్ అంటున్నారు.
మిడిలార్డర్ కనుక ఇదే రేంజ్‌లో బలంగా ముందుకెళ్తే.. ఈసారి వరల్డ్ కప్ మనదే అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. గత ఐసీసీ ఈవెంట్లలో టీమిండియాకు మిడిలార్డరే పెద్ద సమస్యగా ఉండేదని, కానీ ఈసారి మిడిలార్డర్ పెద్ద బలంగా కనిపిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.